ప్రస్తుతం శ్రీలీల ఎంబీబీఎస్ చదువుతూనే సినిమాలు చేస్తుంది. ఒకవైపు కెరీర్, మరోవైపు సినిమాలను బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్తోంది. అయితే ఇప్పుడు ఎంబీబీఎస్ పరీక్షలు ఉండటంతో శ్రీలీల సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటుంది. అందుకే కొత్తగా వేరే సినిమాలను ఒప్పుకోవడం లేదు. ముందుగా ఒప్పుకున్న సినిమాలనే కంప్లీట్ చేస్తోంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మాత్రమే ఉంది.చాలామంది దర్శకులు ఆమెను నటన పాత్రల కంటే డ్యాన్స్ నంబర్ కోసం ఎంచుకుంటున్నారు. దీంతో శ్రీలీల స్మార్ట్‌గా మారింది. ఇప్పుడు శ్రీలీల డ్యాన్స్‌పైనే కాకుండా నటనపై కూడా దృష్టి పెట్టాలనుకుంటోంది. ఆమె కేవలం డ్యాన్స్ కోసం మాత్రమే అవసరమయ్యే ప్రత్యేక పాటలు, చిత్రాల ఆఫర్‌లను తిరస్కరించింది. ఇటీవల శ్రీలీల ఓ హీరోతో కలిసి డ్యాన్స్ చేయడానికి వచ్చిన ఒక భారీ ఆఫర్‌ని తిరస్కరించిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. ఇంకేముంది.. స్పెషల్ సాంగ్స్ చేయడం వల్ల శ్రీలీలా మరింత ఫేమస్ అయి సక్సెస్ అవుతుందని కొందరు అనుకోవచ్చు. కానీ వాటికి నో చెప్పడం ద్వారా, ఆమె నటనపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం ఆమెకు మంచి పాత్రలు పొందడానికి, అగ్రహీరోయిన్‌గా నిలదొక్కుకోవడానికి సాయపడే అవకాశం వుందని సినీ జనం అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి