ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదలైన హనుమాన్ మూవీ ఏ స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో తేజ సజ్జ హీరో గా నటించిన అమృత అయ్యర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ప్రశాంత్ వర్మమూవీ కి దర్శకత్వం వహించగా ... వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. 

ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ సినిమా యొక్క తెలుగు మరియు హిందీ వర్షన్ ఇప్పటికే "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ "జీ 5" ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతూ ఉండగా ... హిందీ వర్షన్ జియో సినిమా "ఓ టి టి"  లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ యొక్క తమిళ్ , మలయాళ , కన్నడ వర్షన్ "ఓ టి టి" విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.

మూవీ యొక్క తమిళ్ , మలయాళ , కన్నడ డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా తాజాగా ఈ సంస్థ వారు ఈ సినిమా యొక్క తమిళ్ , మలయాళ , కన్నడ వర్షన్ లను ఏప్రిల్ 5 వ తేదీ నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: