కోలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ చాలా సంవత్సరాల క్రితం గిల్లి అనే మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా భూమిక హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఒక్కడు మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. ఇకపోతే ఒక్కడు మూవీ కి అధికారిక రీమేక్ కావడంతో ఈ మూవీ పై మొదటి నుండి తమిళ ప్రేక్షకులు బారి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో విజయ్ కి జోడీగా త్రిష నటించింది. ఈ సినిమాలో విజయ్ , త్రిష జోడీకి కూడా ఆ సమయంలో అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ విడుదల అయిన చాలా సంవత్సరాల తర్వాత తాజాగా గిల్లి నీ రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా 2 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 2 రోజుల్లో ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా ఎన్ని కోట్ల కలెక్షన్ లను సాధించింది అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి విడుదల అయిన 2 రోజుల్లో రీ రిలీజ్ లో భాగంగా తమిళ నాడు లో 7.80 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి విడుదల అయిన 2 రోజుల్లో రీ రిలీజ్ లో భాగంగా కర్ణాటక లో 50 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి విడుదల అయిన 2 రోజుల్లో రీ రిలీజ్ లో భాగంగా రెస్ట్ ఆఫ్ ఇండియా లో 30 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి విడుదల అయిన 2 రోజుల్లో రీ రిలీజ్ లో భాగంగా ఓవర్ సిస్ లో 3.55 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీకి విడుదల అయిన 2 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 12.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇలా రీ రిలీజ్ లో భాగంగా గిల్లి మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 2 రోజుల్లో సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: