రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా కల్కి 2898 ఏడి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో దీపికా పదుకొనే , దిశా పటానీ హీరోయిన్ లుగా నటించగా ... కమల్ హాసన్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. బాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అమితా బచ్చన్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఈ మూవీ ని అశ్విని దత్ నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాని జూన్ 27 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో మేకర్స్ ప్రచారాలను ఇప్పటికే మొదలు పెట్టారు. అందులో భాగంగా కొన్ని వీడియోలను కూడా విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు ఓ టీ టీ డీల్ కూడా క్లోజ్ అయినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈ సినిమా రెండు ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల ఓ టి టి హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకున్నట్లు , హిందీ వెర్షన్ యొక్క ఓ టీ టీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అలా ఈ సినిమా రెండు ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: