తెలుగు సినీ పరిశ్రమలో చాలా సంవత్సరాలు టాప్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన వారిలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన చందమామ మూవీ తో తెలుగు పరిశ్రమలో మొదటి కమర్షియల్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత ఈమె మగధీర సినిమాలో హీరోయిన్ గా నటించింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరో గా రూపొందిన ఈ సినిమా టాలీవుడ్ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఇక ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడం , ఇందులో కాజల్ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈమె ఈ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది. అలా చాలా సంవత్సరాలు కెరియర్ ను కొనసాగించిన ఈ బ్యూటీ కొంత కాలం క్రితమే వివాహం చేసుకొని ఒక పండంటి బిడ్డకు జన్మను ఇచ్చింది. ఇక వివాహం , ఒక బిడ్డను కు జన్మను ఇచ్చే క్రమంలో ఈమె కొంత కాలం సినిమాలకు దూరంగా ఉంది. మళ్ళీ వరుస సినిమాలలో నటిస్తూ వస్తోంది. కొన్ని రోజుల క్రితమే భగవంత్ కేసరి మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్న ఈమె తాజాగా సత్యభామ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది.

లేడీ ఓరియంటెడ్ మూవీ గా రూపొందిన ఈ సినిమాలో కాజల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఈ సినిమాను జూన్ 7 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈమెకు వరుసగా మరిన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలు వచ్చే అవకాశం ఉంది. దానితో సత్యభామ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే కాజల్ కి కొన్ని సంవత్సరాల పాటు ఆపడం కష్టమే అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి కాజల్ "సత్యభామ" మూవీ తో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: