టాలీవుడ్ లో ఇంకా పెళ్లి చేసుకోలేని వాళ్ళు చాలా మందే ఉన్నారు. వారిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ కూడా ఒకరు. డార్లింగ్ ప్రభాస్ పెళ్లి కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.44 ఏళ్ళు వచ్చిన ప్రభాస్ పెళ్లి గురించి ఎవరో ఒకరు కామెంట్స్ చేస్తూనే ఉంటారు. పాన్ ఇండియా స్టార్ హీరో అయి ఉండి.. ప్రభాస్ ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే, బాహుబలిలో ఐదేళ్లపాటు ప్రభాస్‌తో కలిసి పనిచేసిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి, ప్రభాస్ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదనే విషయం పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్ చేశాడు. రాజమౌళి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. ప్రభాస్ పెళ్లి గురించి స్పందించారు. "ప్రభాస్ కి ఎంత బద్ధకం అంటే .. అంత ఉంటుంది. నిజం చెప్పాలంటే.. పెళ్లి చేసుకోవాలన్నా కూడా ప్రభాస్ కి బద్ధకమే. ఇప్పటికిప్పుడు ఒక అమ్మాయిని చూసి.. ఆమెను కలిసి.. ఆమెను ప్రేమించి.. వాళ్ళ పెద్ద వాళ్లతో మాట్లాడడం.. ప్రభాస్ కి చాలా పెద్ద పని. అందుకే ప్రభాస్ ఇంకా పెళ్లి కావడం లేదని" అని అన్నారు రాజమౌళి. రాజమౌళి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్నాడు. అదే సమయంలో, ప్రభాస్ కూడా కొత్త చిత్రాల షూటింగ్‌లలో బిజీగా ఉన్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన 'కల్కి' ఈ నెల 27న థియేటర్లలోకి రానుంది.బాహుబలితో ఒక్కసారిగా స్టార్‌ హీరోగా ఎదిగారు ప్రభాస్‌. పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్‌ నుంచి ఏదైనా కొత్త వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా బజ్‌ పెరుగుతుంది.సలార్‌తో భారీ విజయాన్ని అందుకొని, దేశవ్యాప్తంగా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులను సృష్టించిందీ మూవీ. దీంతో ప్రభాస్‌తో లు చేయడానికి మేకర్స్ సైతం ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అత్యధిక పారితోషకం ఇస్తూ సినిమా లు చేస్తున్నారు.ప్రభాస్‌ ప్రస్తుతం చేతిలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: