చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తోపాటు తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసి ఇక్కడి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది అవికా గోర్. అయితే ఎంతో పద్ధతిగా ఉండే పాత్రలకే మొదట్లో పరిమితమైన ఆమె..తర్వాత కొన్ని సినిమాల్లో రెచ్చిపోయి కిస్సింగ్, సెక్స్ సీన్లలో నటించింది. ఈ సీన్లు చేయడం ఎలాంటి ఫీలింగ్ ఇస్తుందన్న ప్రశ్నకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె స్పందించింది.అవికా గోర్ ఈ మధ్య హాటర్‌ఫ్లైకి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఇంటిమేట్ సీన్లు చేయడంతోపాటు తన బాయ్‌ఫ్రెండ్ మిలింద్ చంద్వానీతో రిలేషన్షిప్ లాంటి వాటిపై స్పందించింది. ఏడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే టీవీ సీరియల్ తో బిజీగా మారిన ఆమె.. తర్వాత హీరోయిన్ గా మారి సినిమాలు చేసింది. గతేడాది వచ్చిన 1920 అనే హారర్ మూవీలో ఆమె చాలా హాట్ హాట్ సీన్స్ చేసింది.వీటిపై తాజా ఇంటర్వ్యూలో ప్రశ్నించగా ఆమె ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చింది. సెక్స్ సీన్లు చేయడం సరదాగా ఉంటుందని అందరూ భావిస్తారు కానీ.. అవి చాలా బోరింగ్ అని ఆమె చెప్పడం విశేషం. అయితే ఇలాంటి సీన్లను తనతోపాటు మిగతా నటీనటులు కూడా చాలా సౌకర్యవంతంగా చేయడానికి కారణం కోఆర్డినేటర్ కృష్ణా భట్ కారణమని అవికా తెలిపింది.కృష్ణా భట్ చాలా ప్రొఫెషనల్ అని, ఆమె ఇమ్రాన్ హష్మి సినిమాలకూ పని చేసిన అనుభవంతో సెట్స్ లో నటీనటులు చాలా సౌకర్యవంతంగా ఇలాంటి సీన్లను చేసేలా చేస్తారని అవికా తెలిపింది. ఇక డైరెక్టర్ విక్రమ్ భట్ గురించి స్పందిస్తూ.. తమ కంటే ఎక్కువగా ఆయనే సిగ్గు పడతారని చెప్పడం విశేషం. "విక్రమ్ సర్ ఓ ప్రొఫెషనల్. సెట్స్ లో ఎవరైనా ఎక్కువగా సిగ్గు పడతారంటే అది మా కంటే ఆయనే ఎక్కువ. చాలాసార్లు ఆయన ఇలాంటి సీన్లతో కాస్త ఇబ్బందిగా ఫీలవుతారు" అని అవికా చెప్పింది.

అలాంటి టీమ్ తో కలిసి పని చేసినప్పుడు ఇలాంటి సీన్లు చేయడం కూడా సులువు అవుతుందని ఆమె తెలిపింది. ఏది అవసరమో అది చేస్తున్నామన్న ఫీలింగ్ తప్ప మరొకటి ఉండదు. ఇక తాను చేసిన ఇంటిమేట్ సీన్లలో ఎక్కడా న్యూడిటీ కనిపించదని, నటీనటులు ఇలాంటి సీన్లు చేయడానికి ఎలా ఫీలవుతారో అర్థం చేసుకోవడం ముఖ్యమని ఆమె చెప్పింది."లవ్ మేకింగ్ సీన్లలాంటివి అన్నీ ఉంటాయి. కానీ చాలా వరకు నా శరీరం ఎక్కడా బయటకు కనిపించదు. డైరెక్టర్లు అలా చూపిస్తారు. దీనికి సంబంధించిన చర్చ ఎంతో ముందుగానే జరిగిపోతుంది" అని అవికా తెలిపింది. ఇక సహచర నటులు కూడా తనను టచ్ చేసే సమయంలోనూ తన అనుమతి అడుగుతారని ఆమె చెప్పడం విశేషం.అవికా గోర్ తెలుగులో 2013లో ఉయ్యాలా జంపాలా మూవీతో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మావా, తను నేను, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజుగారి గది 3, నెట్, థ్యాంక్యూ, పాప్‌కార్న్, ఉమాపతిలాంటి సినిమాల్లో నటించింది. వధువు అనే వెబ్ సిరీస్ కూడా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: