తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ హనీ రోజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గతంలో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో మలయాళ  ఇండస్ట్రీలో తిరిగి పలు సినిమాలలో నటించింది. అక్కడ పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే బాలయ్య నటించిన వీరసింహారెడ్డి చిత్రంలో నటించడంతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. నిరంతరం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ హీటెక్కిస్తూ ఉంటుంది. డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఈ ముద్దుగుమ్మ తన అందంతో నటనతో అందరిని ఆకట్టుకుంది.


హనీ రోజ్ నుంచి సినిమా కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. దాదాపుగా ఏడాదిపైనే కావస్తోంది ఈ ముద్దుగుమ్మ సినిమా విడుదల కాక..ఈ హాట్ బ్యూటీ ప్రధాన పాత్రలో నటిస్తున్న రాచెల్ అనే ఒక సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ కూడా విడుదల కావడంతో చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది. ఈ టీజర్ లో హానీ రోజ్ చాలా డిఫరెంట్ పాత్రలో కనిపిస్తున్నట్లు కనిపిస్తోంది. గ్లామర్ తో కనిపించడం మే కాకుండా కత్తి పట్టుకొని యాక్షన్ సన్నివేశాలను కూడా చేయడానికి రాచెల్ సినిమాలో సిద్ధమయ్యింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ వంటి భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నది చిత్ర బృంద.


ఈ సినిమాతో హనీ రోజ్ ప్రేక్షకులను అలరించడం ఖాయమని అభిమానుల సైతం తెలియజేస్తున్నారు .ఈ చిత్రానికి ఆనంది బాల డైరెక్షన్ వహిస్తూ ఉండగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం లేడీ ఓరియంటెడ్ చిత్రమన్నట్టుగా కనిపిస్తోంది. మరి ఈ సినిమాతో అన్ని రోజు ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. ప్రస్తుత మైతే హనీ రోజ్ సినిమాకి సంబంధించి ఈ టీజర్ అయితే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తెలుగు ప్రేక్షకులు తెలుగులో ఈ ముద్దుగుమ్మను ఏదైనా సినిమాలో నటించమని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: