ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న పూజ హెగ్డే గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఇక తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరితో జోడి కట్టి అందరికీ పర్ఫెక్ట్ జోడి అనిపించుకుంది పూజ. అయితే ఒక వైపు సినిమాల్లో బిజీబిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలని పోస్ట్ చేస్తూ ఎప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్ గా మారిపోయేది ఈ సొగసరి. ఇలా తన అందం అభయంతో ఎంతో మంది కుర్ర కారు మతి పోగొట్టింది ఈ హీరోయిన్.


 సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలతో మాత్రమే సరి పెట్టుకోకుండా.. అటు బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంది  ఇక అక్కడ కొన్ని అవకాశాలను అందుకుంది అన్న విషయం తెలిసిందే. కానీ ఎందుకో బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం ఈ అమ్మడు కనెక్ట్ కాలేకపోయింది. దీంతో మళ్లీ టాలీవుడ్ లో అవకాశాల కోసం చూస్తోంది. కాగా ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ల హవా పెరిగిపోయిన నేపథ్యంలో.. సీనియర్ హీరోయిన్గా ముద్రపడిన పూజా హెగ్డే కు గతంతో పోల్చి చూస్తే కాస్త అవకాశాలు తగ్గాయి అని చెప్పాలి.


 ఇకపోతే ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఒక ఐడెంటిటీని తీసుకువచ్చిన టాలీవుడ్ అంటే తనకు ఎంతగానో ప్రత్యేకం అంటూ పూజ హెగ్డే చెప్పుకొచ్చింది  ఎన్ని భాషల్లో నటించిన తెలుగులో అవకాశం వస్తే ఎక్కువగా సంతోషిస్తాను అంటూ తెలిపింది. నటనకు ప్రాంతీయ భేదం లేదని ఏ భాషలోనైనా తనకు కంఫర్ట్ గానే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. త్వరలోనే ఒక మంచి తెలుగు సినిమాలో నటించబోతున్నాను అంటూ తెలిపింది  కాగా ప్రస్తుతం ఈ అమ్మడు సూర్య హీరోగా తెరకెక్కుతున్న మూవీలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: