లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న తమిళ స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకవైపు సినిమాలు మరొకవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది నయనతార. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తనకి సంబంధించిన ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ షేర్ చేస్తూ ఉంది. అలా నయనతార షేర్ చేస్తున్న ప్రతి ఒక్క పోస్ట్ చూసినా ఆమె అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. అయితే గతంలో సినిమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నయనతార

 ప్రస్తుతం తన పిల్లల కారణంగా మరింత ఫేమస్ అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు .ఎందుకంటే నయనతార పెళ్లి అయిన కేవలం నాలుగు నెలలకే తల్లి అయ్యింది. సరోగసి పద్ధతి ద్వారా ఇద్దరు మగ పిల్లలకి తల్లి అయ్యింది నయనతార. అలా నిత్యం తన పిల్లల ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంది. అలాగే తన భర్తతో కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. అయితే తాజాగా..  పిల్లలను బాహుబలి ఐకానిక్ ఫోజ్ లో ఇన్ స్టా లో విఘ్నేష్ శివన్ షేర్ చేయడం జరిగింది.

 తాజాగా నయనతార ఇలా తన భర్త విఘ్నేష్ శివన్‌ తో కలిసి చిల్‌ అవుతున్న ఫోటోలను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు వైరల్‌ అయ్యింది. అంతే కాదు  షేర్‌ చేసిన ఈ ఫోటోల్లో ఆమె పదేళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. సింపుల్‌ వైట్‌ టీ షర్ట్ లో బ్లూ స్కర్ట్‌ లో నయనతార సింప్లీ సూపర్‌ అన్నట్లుగా నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థాయిలో వరుస అందాల ఫోటోలను మరియు క్యూట్ ఫోటోలను షేర్‌ చేస్తున్న నయనతార ఇన్ స్టా లో దాదాపుగా 8.5 మిలియన్ల ఫాలోవర్స్ ను కలిగి ఉంది. అలా ప్రస్తుతం నయనతార షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: