బాలీవుడ్: 'బలుపు' దర్శకుడికి బ్లాక్ బస్టర్ ఆఫర్? సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం అనేది మాములు విషయం కాదు.. దమ్ము స్టోరీ, గత చిత్రాల రికార్డ్స్ ఉంటె తప్ప అగ్ర హీరోలతో సినిమా చేసే ఛాన్స్ అనేది రాదు..ఇక బాలీవుడ్ హీరోలను డైరెక్ట్ చేసే ఛాన్స్ తెలుగు డైరెక్టర్స్ కు రావాలంటే అది నిజంగా కత్తిమీద సాము లాంటిది.డాన్ శీను, బలుపు, క్రాక్, వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని..ఇప్పుడు బాలీవుడ్ నటుడ్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు.  గదర్ 2 సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సూపర్ కం బ్యాక్ ఇచ్చిన సన్నీ డియోల్ తో గోపీచంద్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా తాలూకా అధికారిక ప్రకటన నేడు వచ్చేసింది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ మూవీ తెరకెక్కబోతుంది. 


కొద్దీ రోజుల కిందే గోపీచంద్ ముంబై వెళ్లి సన్నీ డియోల్ కి కథ చెప్పాడని, సన్నీ వెంటనే ఓకే చేశాడని సమాచారం తెలుస్తుంది. ఇక అలా ఒకే చేయడమే ఆలస్యం సినిమాని అనౌన్స్ చేసేసారు. ఈ అప్డేట్ తెలిసి సినీ ప్రముఖులు , అభిమానులు ఇంకా నెటిజన్లు గోపీచంద్ ని లక్ అంటే నీదే ఏకంగా బాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేశావ్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారట.#SDGM వర్కింగ్ టైటిల్ పేరిట ఈరోజు అధికారికంగా ఈ పాన్ ఇండియా సినిమా అనౌన్స్ మెంట్ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్‌ అధినేతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ఇంకా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి చెందిన టిజి విశ్వ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీకి  తమన్ సంగీతం అందించబోతున్నాడు. ఈ సినిమాను హిందీలో తెరకెక్కించినా కూడా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ మూవీలో హీరోయిన్లుగా సయామీ ఖేర్ మరియు రెజీనా కసాండ్రా నటించబోతున్నారట. ఇక షూటింగ్ తాలూకా వివరాలు అతి త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: