అనేక సంవత్సరాలుగా ఎన్నో డంపింగ్ సినిమాలు తెలుగులో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. అలా విడుదల అయినా కొన్ని సినిమాలకు తెలుగు బుల్లి తెరపై కూడా అద్భుతమైన టి ఆర్ పి రేటింగ్ దక్కిన సందర్భాలు ఉన్నాయి. అలా తెలుగు బుల్లి తేరపై అత్యధిక టి ఆర్ పి రేటింగ్ దక్కించుకున్న టాప్ 5 డబ్బింగ్ సినిమాలు ఏవి అనే విషయాలను తెలుసుకుందాం.

కాంతారా : రిషబ్ శెట్టి హీరోగా రూపొందిన ఈ సినిమాకు తెలుగు బుల్లి తెరపై మొదటి సారి ప్రసారం అయినప్పుడు 12.35 టి ఆర్ పి రేటింగ్ దక్కింది. ఇకపోతే ఈ సినిమాలో రిషబ్ శెట్టి హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు.

కాంచన 3 : రాఘవ లారెన్స్ హీరో గా రూపొందిన కాంచన 3 మూవీ కి మొదటి సారి ప్రసారం అయినప్పుడు తెలుగు బుల్లి తెరపై 13.1 టి ఆర్ పి రేటింగ్ దక్కింది.

కబాలి : సూపర్ స్టార్ రజనీ కాంత్ కొంత కాలం క్రితం హీరో గా రూపొందిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి రెస్పాన్స్ తెలుగు ప్రేక్షకుల నుండి రాకపోయినా ఈ మూవీ మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 14.52 టి ఆర్ పి రేటింగ్ ను దక్కించుకుంది.

బిచ్చగాడు : విజయ్ ఆంటోనీ హీరో గా రూపొందిన ఈ సినిమాకు మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు తెలుగు లో  18.76 టి ఆర్ పి రేటింగ్ దక్కింది. ఇకపోతే ఈ మూవీ తోనే విజయ్ ఆంటోనీ కి కూడా తెలుగు ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది.

రోబో : సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు 19.04 టి ఆర్ పి రేటింగ్ దక్కింది. ఇకపోతే ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

trp