మంచు మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలపొంది. ప్రస్తుతం జల్ పల్లి లో ఉన్న ఇంటిలోనే మోహన్ బాబు కుటుంబం ఉంటుంది. అయితే అక్కడికి వెళ్లి... న్యూస్ కవర్ చేస్తున్న మీడియాపై... మంచు మోహన్ బాబు దాడి చేశారు. ఓ ఛానల్ మైక్ పట్టుకొని... మీడియా ప్రతినిధి పైన దాడి చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనంతరం మోహన్ బాబు కు సంబంధించిన అనుచరులు కూడా రెచ్చిపోయారు.

 మంచు మనోజ్ అనుచరులు అలాగే మీడియా ప్రతినిధులపై దాడి చేశారు మోహన్ బాబు అనుచరులు.  మీడియాకు సంబంధించిన కెమెరాలను కూడా ధ్వంసం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గేటు దాటి లోపటికి వచ్చినందుకు గాను... మీడియాపై మోహన్ బాబు దాడి చేసినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. లైవ్ కవరేజ్ ఇస్తున్న... ఓ ఛానల్ మైక్ పట్టుకొని మరీ రెచ్చిపోయారు మోహన్ బాబు.

 
 దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక అంతకు ముందు డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన మంచు మనోజ్... అనంతరం మోహన్ బాబు ఇంటికి మరోసారి వచ్చారు. తన కూతురు అలాగే కొడుకు లోపలే ఉన్నారు గేట్ తీయండి అని మోహన్ బాబు ఇంటి ముందు గోల చేశాడు. అయితే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ ఎవరు కూడా స్పందించలేదు.

 దీంతో ఆగ్రహానికి గురైన మంచు మనోజ్ కుమార్.... గేటును బద్దలు కొట్టి మరీ లోపటికి వెళ్ళాడు. ఈ తరుణంలోనే మంచు మనోజ్ తో పాటు... మీడియా ప్రతినిధులు లోపటికి ఎంట్రీ ఇచ్చారు. ఇక అక్కడే ఉన్న మోహన్ బాబు రెచ్చిపోయి... మీడియాపై దాడి చేయడం జరిగింది. దీంతో ఓ చానల్ జర్నలిస్టుకు తీవ్ర గాయాలు అయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై పోలీసు అధికారులు సీరియస్ అయినట్లు సమాచారం. మోహన్ బాబు పై యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: