కొంతమంది స్క్రీన్ పైన నవ్విస్తేనే నవ్వొస్తుంది . కానీ బ్రహ్మానందం లాంటి వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తేనే నవ్వొస్తుంది . తన బాడీ మాడ్యూలేషన్ తోనే నవ్వించేస్తూ అందరిని ఆకట్టుకుంటాడు బ్రహ్మానందం . ఇప్పుడు సినిమాలకి దూరంగా ఉన్నాడు . అది ఎందుకు అనే కారణం కూడా బయటపెట్టాడు. "బ్రహ్మానందం అనేవాడు ఒకప్పుడు కామెడీ బాగా చేశాడు.. ఇప్పుడు చేయలేకపోతున్నాడు అన్న పేరు నాకు వద్దు అని.. బ్రహ్మానందం ఎప్పుడూ కామెడీ బాగానే చేశాడు అన్న పేరు మాత్రమే ఉంటే చాలు అని ..ఆ కారణంగానే నేను సినిమాలకి దూరంగా ఉంటున్నాను అని ..నాకు అవకాశాలు రాక కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు".
కాగా ఇలాంటి మూమెంట్లోనే బ్రహ్మానందం కి సంబంధించిన ఇంకొన్ని విషయాలు బాగా వైరల్ గా మారాయి . బ్రహ్మానందం ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులే నవ్వులు. సరదాగా సెట్లో అందరితో మింగిల్ అయిపోతాడు. అయితే కొంతమంది ముంబై హీరోయిన్స్ కి తెలుగు రాదు . అలాంటి మూమెంట్లో సరదాగా వాళ్లతో మాట్లాడుతూ నవ్విస్తూ అల్లరి చేస్తారట బ్రహ్మానందం . మరీ ముఖ్యంగా కొంతమంది హీరోయిన్స్ కి ఇష్టం లేకపోయినా వాళ్ళపై పంచ్ డైలాగ్స్ వేస్తూ సరదాగా నవ్విస్తారట . కొంతమంది హీరోయిన్స్ ఆయన కామెడీని చాలా ఫన్నీ గానే తీసుకున్న .. మరి కొంత మంది మాత్రం ఆయన కామెడీని అస్సలు యాక్సెప్ట్ చేయని విధంగా బిహేవ్ చేస్తారట . కానీ బ్రహ్మానందం మాత్రం అందరిని నవ్వించడానికి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాడు . బ్రహ్మానందం కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాలా..?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి