సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంటే  కత్తి మీద సాము లాంటిదే అని చెప్పవచ్చు. ఇండస్ట్రీలో ఒక హీరో, హీరోయిన్ లేదా డైరెక్టర్, నిర్మాతగా నిలబడాలి అంటే అదృష్టంతో పాటు టాలెంట్ కూడా ఉండాలి. అలా ఇండస్ట్రీలో  కొంతమంది ఎంతో బ్యాగ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చి కూడా  స్టార్డం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఆ స్టార్ డం వచ్చిన తర్వాత నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టమైన పనే. దానికోసం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో  ఎన్నో ఇబ్బందులు పడి డైరెక్టర్ గా గొప్ప స్థాయికి ఎదిగారు రాఘవేంద్రరావు. ఆయన ఎదగడమే కాకుండా ఎంతో మంది హీరోలను కూడా  స్టార్లుగా మార్చిన ఘనత ఆయనది. ఆయన ఏ చిత్రం తీసిన తనదైన స్టైల్ లో సరికొత్తగా చూపిస్తారు. అలాంటి రాఘవేంద్రరావుకు చాలా కూల్ మైండ్ ఉంటుంది..

 అలాంటి ఈ డైరెక్టర్  ఓసారి వెంకటేష్ తో సినిమా చేస్తూ కోపం వచ్చి తన కళ్లద్దాలు నెలకేసి కొట్టాడట. దీంతో షూటింగ్ సెట్లో ఉన్న వాళ్లంతా షాక్ అయిపోయారు. తన కోపానికి కారణం ఏంటో తెలుసుకోలేకపోయారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. వెంకటేష్ హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో కలియుగ పాండవులు చేశారు. రాఘవేంద్రరావు డైరెక్టర్ గా వ్యవహరించిన ఈ సినిమా షూటింగ్ చేసే సమయంలో ఒక సీన్ లో వెంకటేష్ సరిగా నటించలేదట. దాని గురించి ఒకటికి పది సార్లు ఆయన అర్థం చేసుకోకపోవడంతో కోపానికి వచ్చి తన కళ్లద్దాలు నేలకేసి కొట్టాడట.

దీంతో షూటింగ్ అంతా ఆగిపోయింది. ఆ తర్వాత రోజు వెంకటేష్ తండ్రి  రామానాయుడు రాఘవేంద్రరావును కూల్ చేసి వెంకటేష్ కు అర్థమయ్యేలా చెప్పారట. ఆరోజు రాఘవేంద్రరావు ఏ సీన్ కోసమైతే కోపానికి వచ్చారో కలియుగ పాండవులు సినిమాలో ఆ సీనే సూపర్ హిట్ అయింది. సినిమాని మలుపు తిప్పి సినిమా కూడా బంపర్ హిట్ ఎలా చేసింది. ఆ తర్వాత వెంకటేష్ ఆయన కోపం వల్ల నేను సక్సెస్ అయ్యాను అర్థం చేసుకొని రాఘవేంద్రరావును అర్థం చేసుకోవడం మొదలుపెట్టారట.

మరింత సమాచారం తెలుసుకోండి: