
తాజాగా మలైకా స్పెషల్ క్లాస్ యూత్ అంటూ దూసుకుపోతోంది..తన నడుము పొట్ట చుట్టూ ఉండే కొవ్వును సైతం కరిగించేందుకు సరికొత్త యోగ ఫిట్నెస్ వ్యాయామం అంటూ ఒక వీడియోని కూడా షేర్ చేసింది. ఈ వీడియోలో మలైకా తల వెనుక చేతులు ఉంచి మరి తన కాలి మడమల మీద కూర్చొని తన నడుము ను నెమ్మదిగా అటు ఇటు కదిలిస్తూ ఒత్తిడి పెంచి సింపుల్గా పొట్ట దగ్గర ఉండే కొవ్వును ఇలా కరిగించుకోవచ్చు అంటూ వీడియో రూపంలో తెలియజేస్తుంది. అయితే ఆఫీసులలో ఎక్కువగా కూర్చొని పని చేసే వారికి ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది అంటూ మలైక తెలియజేసింది. తాను ప్రతిరోజు పది సార్లు ఇలా చేస్తానని వెల్లడించింది.
అయితే మలైకా ఇలాంటి దుస్తులలోనైనా సరే చాలా అట్రాక్షన్ గా అందరి దృష్టిని ఆకర్షించే విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియోలో మోటాలిక్ షార్ట్స్ ,మ్యాచింగ్ స్పోర్ట్స్ బ్రా ధరించి తన ఫిట్నెస్ వైపు తో అందాలను కూడా చూపిస్తోంది. తను నాజుకైనా శరీరాన్ని కూడా ప్రదర్శించడానికి తాను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నట్లు కనిపిస్తోంది. సినిమాలలో కంటే పలుకు షోలకు జడ్జిలుగా వ్యవహరిస్తోంది.