టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా , నిర్మాతగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు అయినటువంటి కళ్యాణ్ రామ్ గురించి జనాలకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కళ్యాణ్ రామ్ ఆఖరుగా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందిన బింబిసారా అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన నటించిన అమిగొస్ , డెవిల్ సినిమాలు వరుసగా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇలా వరుసగా రెండు అపజయాల తర్వాత కళ్యాణ్ రామ్ తాజాగా అర్జున్ S/O వైజయంతి అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి అయినటువంటి సాయి మంజ్రేకర్ , కళ్యాణ్ రామ్ కి జోడిగా నటించగా ... విజయశాంతిమూవీ లో అత్యంత కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమాను ఏప్రిల్ 18 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 8 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 8 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

8 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 2.43 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 95 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 3.10 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6.48 కోట్ల షేర్ ... 11.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక 8 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 35 లక్షల కలెక్షన్లు దక్కగా , ఓవర్సీస్ లో 56 లక్షల కలెక్షన్లు దక్కాయి. 8 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి 7.39 కోట్ల షేర్ .. 14.35 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ 22 కోట్ల భారీ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగగా ... మరో 14.61 కోట్ల షేర్ కలెక్షన్లను సాధిస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకొని హిట్ స్టేటస్ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nkr