బాహుబలి కట్టప్ప గురించి సోషల్ మీడియాలోని ఎన్నో మెయిన్స్ కూడా ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి. బాహుబలి బాహుబలి 2 సినిమాల సక్సెస్ వెనుక రాజమౌళి దూరదృష్టి ఉందని చెప్పవచ్చు. రాజమౌళి పురాతన పురాణాలను సైతం ఎంతో ఆధునికంగా చూపించగలరు. అందుకే రాజమౌళి సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయని నటి నదులు భావిస్తూ ఉంటారు అందుకే రాజమౌళి సినిమాలో ఎలాంటి చిన్న అవకాశం వచ్చినా కూడా వదులుకోకుండా నటిస్తూ ఉంటారు. రాజమౌళి సినిమాలలో ఊహించని మలుపులు భాగోద్వేగమైన సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేసేలా చేస్తూ ఉంటాయి.
బాహుబలి చిత్రంలోని యుద్ధ సన్నివేశాలలో చూపించిన తీరు అలాగే ప్రకృతి దృశ్యాలలో చూపించిన విజువల్ ఎఫెక్ట్ సౌండ్ ఇలా అన్నిటిలో కూడా రాజమౌళి తన మార్కును చూపించగలిగారు. బాహుబలి 2 అంటే కేవలం ఒక సంఖ్య కాదు.. తెలుగు సినిమా పరిశ్రమని ఒక గొప్ప స్థాయికి తీసుకువెళ్లిన సినిమా. తాజాగా ఈ సినిమా ఎనిమిదో వార్షికోత్సవం పురస్కరించుకుంది. దీంతో నిర్మాత శోభు యార్లగడ్డ అక్టోబర్ నెలలో బాహుబలి చిత్రాన్ని ఇండియాలో అంతర్జాతీయంగా కూడా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఇందులో అభిమానుల కోసం ఎన్నో ఆశ్చర్యమైన విషయాలు జ్ఞాపకాలతో పాటు కొత్త విషయాలు కూడా ఉండబోతున్నాయని తెలిపారు నిర్మాత.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి