
ఈ సినిమాకు సిద్దార్థ్ ఆనంద్, మమతా ఆనంద్ నిర్మాతలుగా వ్యవహరించారు. మూవీకి షెజాన్ షైక్, సచిన్ జిగర్ సంగీతం అందించారు. ఖరీదైన వజ్రాలను దొంగతనం చేసే వ్యక్తి కథతో ఈ జ్యువెల్ థీఫ్ సినిమా రూపొందింది. రేహాన్ రాయ్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ ఒక వజ్రాల దొంగల నటించారు. ఈయన తన తండ్రి ఇబ్బందుల్లో ఉన్నడని తెలుసుకుంటాడు. రేహాన్ తండ్రి క్లినిక్ ని, అండర్ వరల్డ్ సంబంధాలు ఉన్న రాజన్ ఔలఖ్ తో సమస్య ఉంటుంది. ఆ సమస్య నుండి తండ్రిని కాపుడుకునేందుకు.. రాజన్ తో రేహాన్ డీల్ కుదుర్చుకుంటాడు. రెడ్ సన్ అనే వజ్రాన్ని దొంగిలించి తీసుకొస్తానని చెప్తాడు. ఈ క్రమంలో రేహాన్ వజ్రాన్ని ఎలా దొంగిలించాడు..? ఎన్ని సమస్యలు ఎదురుకున్నాడు..? అనేదే కథ.
ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ నటన చాలా బాగుంది. ఇంకా నికితా దత్త కూడా నటనతో ప్రేక్షకులు ఆకట్టుకుంది. దొంగతనం సీన్స్ చాలా అద్బుతంగా అనిపించాయి. ఇక సినిమా మైనస్ ల విషయానికి వస్తే.. అంతా పెద్దగా ఎమోషన్ పండలేదు. ప్రేక్షకులను టెన్సన్ పెట్టె సీన్స్ సరిగ్గా లేవు. ట్విస్ట్ లు కూడా లేవు. రేహాన్ దొంగ అవ్వడానికి గల ఉన్న కారణం చాలా చిన్నదిగా ఉంది. కొన్ని పాత్రలను కథతో సంబంధం లేకుండా డిజైన్ చేశారు. ఇక ఈ సినిమా ఓటీటీలో ఫ్లాప్ అయింది. ఈ మూవీకి కేవలం 2 పాయింట్స్ రేటింగ్ మాత్రమే లభించింది.