
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. ఆల్మోస్ట్ అదే న్యూస్ కన్ఫామ్ చేసేస్తున్నారు అల్లు అర్జున్ సన్నిహితులు . సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమాలో నటించబోతున్నాడు అంటూ తెగ టాక్ వైరల్ అయింది . అయితే ఇది హీరోగా కాదు అని ఆయన నెగిటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు అంటూ లేటెస్ట్ సమాచారం ప్రకారం తెలుస్తుంది . ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది .
అల్లు అర్జున్ - సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వంలో నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపిస్తే ఖచ్చితంగా అది ఆయనకి తెలుగు ఇండస్ట్రీలో ఆయన క్యారెక్టర్ దెబ్బ తినే విధంగా ఉంటుంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు .నిజమే తెలుగు ఇండస్ట్రీలో ఒక బిగ్ బడా హీరో మరి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్లి విలన్ గా ఎలా నటిస్తాడు..? సంజయ్ లీల భన్సాలీ ఎంత పెద్ద డైరెక్టర్ అయితే ఆయన క్యారెక్టర్ నే వదులుకుంటారా..? అంటూ అల్లు అర్జున్ అభిమానులు కూడా ప్రశ్నిస్తున్నారు . అల్లుఅర్జున్ ఈ విషయంలో బ్యాక్ స్టెప్ తీసుకోవడమే మంచిది అంటూ సజెస్ట్ చేస్తున్నారు సినీ విశ్లేషకులు. లేకపోతే ఫ్యాన్స్ అస్సలు ఊరుకోరు అని అల్లు అర్జున్ మీద బోలెడన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు అని మాట్లాడుతున్నారు . చూద్దాం మరి అల్లు అర్జున్ ఏం చేస్తాడు అనేది..???