
అయితే ఫస్ట్ కమిట్ అయిన డైరెక్టర్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు కానీ ఆ డైరెక్టర్ ప్రభాస్ ని ఏ మాత్రం ఇబ్బంది పెట్టకూడదు .. ఒకవేళ ఇబ్బంది పెట్టాడా..? అంతే సంగతులు ఆ డైరెక్టర్ ని వెనక్కినెట్టి కొత్త డైరెక్టర్ ని ఆ ప్లేస్ లోకి తీసుకోస్తాడు. ఇప్పుడు అలానే మారిపోయింది పరిస్ధితి అంటూ సినిమా ఇండస్ట్రీలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. ప్రెసెంట్ ప్రభాస్ స్పిరిట్ సినిమా సెట్స్ లో పాల్గొనాలి.. కానీ సందీప్ రెడ్డి వంగ పెడుతున్న కండిషన్లకి మైండ్ బ్లాక్ అయిపోతున్న ప్రభాస్ ..ఈ సినిమాని హోల్డ్ లో పెట్టారట .
అంతేకాదు ఈ సినిమా ప్లేస్ లోకి ప్రశాంత్ వర్మ ని తీసుకొచ్చారట. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట పైకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారట. కొంతమంది ఏకంగా సందీప్ రెడ్డివంగా టార్చర్ తట్టుకోలేక ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు ప్రభాస్ అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు. అంతేకాదు ప్రభాస్ - ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్గా ఒక ఫ్లాప్ బ్యూటీని తీసుకున్నారు అంటూ టాక్ వినిపిస్తుంది . భాగ్యశ్రీ బోర్సేను ఈ సినిమాలో హీరోయిన్గా చూస్ చేసుకున్నారట ప్రశాంత్ వర్మ. ప్రజెంట్ ఆమె విజయ్ దేవరకొండ - రామ్ సినిమాలతో బిజీగా ఉంది . ఒకవేళ నిజంగానే ఈ ఆఫర్ ఆమెకు వస్తే ఆమె అంత లక్కీ ఫెలో ఎవ్వరూ లేరని చెప్పాలి . ఇప్పటివరకు సరిగ్గా హిట్స్ కొట్టని భాగ్యశ్రీ ప్రభాస్ సినిమాలో ఆఫర్ అంటే మామూలు విషయం కాదు. అయితే స్పిరిట్ సినిమాను ప్రభాస్ నిజంగానే వదులుకునేసాడా ..? లేకపోతే హోల్డ్ లో పెట్టాడా ..? అనేది ప్రభాస్ అభిమానులకి బిగ్ టెన్షన్ పుట్టిస్తుంది. దీనిపై ప్రభాస్ క్లారిటీ ఇస్తే బాగుంటుంది అంటున్నారు సినీ ప్రముఖులు..!