మనిషి పుట్టుక పుట్టాక ప్రతి మనిషికి కూడా కుళ్ళు .. స్వార్థం  లాంటివి ఉండనే ఉంటాయి.  అఫ్కోర్స్ అలా ఉంటేనే ఆ మనిషి మనిషిగా సర్వైవ్ అవ్వగలడు. కానీ ప్రతి విషయంలోనూ కుళ్ళు కుతంత్రాలు రాద్ధాంతాలు ఉంటే లైఫ్ లో ఎదగలేరు అది ఏ రంగంలోనైనా సరే . మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అలా ఉంటే లైఫ్ నీ ముందుకు తీసుకెళ్లలేరు . కానీ ఇక్కడ మనం మాట్లాడుకోబోయేది మాత్రం ఒక బిగ్ బడా స్టార్ గురించి . ఆల్రెడీ స్టార్ అని ప్రూవ్ చేసుకున్నాడు. పైగా బిగ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన స్టార్.


అయితే ఈ స్టార్ కి ఎప్పటినుంచో స్టేటస్ పిచ్చి ఉంది . ఆయన రేంజ్ స్టేటస్ ఉన్న హీరోలతోనే మింగిల్ అవుతాడు . ఆశ్చర్యం ఏంటంటే ఎవరైనా టైర్ 2 హీరో సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ లో పాల్గొనమన్న ..ప్రీ రిలీజ్ ఈవెంట్లకి రమ్మన్న ..ఈ హీరో అసలు స్టేజ్ పైకే ఎక్కడు.  ఈవెంట్ కి రావడానికి ఇంట్రెస్ట్ కూడా చూపించడు.  కేవలం బిగ్ బడా స్టార్స్ సినిమాలకి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అవుతూ ఉంటాడు . అయితే సోషల్ మీడియా వేదికగా మాత్రం పలువురు స్టార్ హీరోస్ నటించిన సినిమాలకు బాగా రివ్యూ ఇస్తారు మైండ్ బ్లోయింగ్ అని చాలా కాలం తర్వాత ఇలాంటి సినిమా చూస్తున్నామని ఇలాంటి హీరోనే ఇండస్ట్రీకి కావాలి అని రకరకాలుగా పెద్ద పెద్ద భారీ కొటేషన్స్ పెడుతూ ఉంటారు .



అయితే ఈ హీరోకి ఎందుకో మొదటి నుంచి నాని అంటే అసలు పడదు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపించేవి . అప్పుడెప్పుడో "నాని నటించిన సరిపోద శనివారం" సినిమా ని ప్రమోట్ చేయమంటూ ఈ స్టార్ హీరో వద్దకు వెళితే నో అంటూ ముఖాన రిజెక్ట్ చేశారట . అప్పుడు ఆయన చెప్పిన రీజన్ కూడా వాలీడ్ గా లేదు అంటూ సినీ మేకర్స్ మాట్లాడుకున్నారు . అయితే ఇప్పుడు రీసెంట్ గా నాని నటించిన హిట్ 3 సినిమా రిలీజ్ అయింది.  ఈ సినిమాకి సంబంధించి చాలా మంది స్టార్ట్స్ కూడా రివ్యూ ఇస్తున్నారు . నాని నటన కెవ్వు కేక అంటూ ఓ రేంజ్ లో ప్రశంసిస్తున్నారు . అయితే ఈ హీరో మాత్రం అసలు నానికి సంబంధించిన సినిమా గురించి పట్టించుకోవడం లేదు. దీంతో నాని ఫ్యాన్స్ ఫుల్ గా స్టార్ హీరోని టార్గెట్ చేశారు . డబ్బు పేరు పలుకుబడితో ఇండస్ట్రీలోకి రావడం కాదు నీతి నిజాయితీగా సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి హిట్ కొట్టడమే రియల్ హీరోయిజం అంటే అంటూ పొగిడేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: