మన బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది న్యాచురల్ గా యాక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా అంటూ పరోక్షంగా సాయిపల్లవి పై ఫైర్ అయిపోయారు . అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మరొక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. సాయి పల్లవి బాలీవుడ్ రామాయణ కోసం ఏకంగా 13 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుందట, ఇప్పటివరకు ఏ హీరోయిన్ కూడా ఇంత రేంజ్ మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకోలేదు . నయనతార కూడా జవాన్ సినిమా కోసం 12 కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్ గా ఛార్జ్ చేసింది అంటూ వార్తలు వినిపించాయి.
అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సాయి పల్లవి అంతకుమించిన రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకు ఉంటుంది అని తెలియడంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది జనాలు ఆమెపై ఓ రేంజ్ లో నెగిటివ్గా స్పందిస్తున్నారు . ఏంటి సాయి పల్లవికి అంత సీన్ ఉందా..? ఆమె అంత తోపైన హీరోయిన్ నా..? అంటూ ఘాటు ఘాటుగా ఆమెను విమర్శిస్తున్నారు . సాయి పల్లవి పై బాలీవుడ్ ఇండస్ట్రీలో పూర్తిగా నెగిటివిటీ ఏర్పడిపోయింది. అయితే మొదట నుంచి సాయిపల్లవి నెగిటీవ్ కామెంట్స్ ని పెద్దగా పట్టించుకోదు అన్న సంగతి అందరికి బాగా తెలిసిందే..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి