టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ సమంత - నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కొన్నాళ్లు సినిమాకి బ్రేక్ ఇచ్చింది.  ఆ తర్వాత పుష్ప2 సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది . ఆ తర్వాత ఖుషి మూవీలో నటించింది . శాకుంతలం సినిమా అంతకుముందే ఓకే చేసి ఆ సినిమాను కంప్లీట్ చేసింది.  ఆ తర్వాత బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన "సిటాడిల్" వెబ్ సిరీస్ లోను నటించింది . అయితే సమంత ఇక ఇలాంటి వర్కౌట్ అవ్వవు అని సమంత లోని కొత్త యాంగిల్ బయట పెట్టాలని తాజాగా ప్రొడ్యూసర్ గా మారింది.


సమంత ప్రొడ్యూస్ చేసిన మూవీ "శుభం".  ఈ సినిమా రీసెంట్ గా  రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి వస్తున్న పాజిటివ్ టాక్ సమంత ఫ్యాన్స్ కి బాగా హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంది . కాగా ఈ మధ్యకాలంలో ఇలాంటి కాన్సెప్ట్ తో మూవీలు చాలా వచ్చాయి . కానీ ఈ సినిమాలో ఏదో మ్యాజిక్ ఉంది అంటూ ట్విట్టర్ వేదిక స్పందిస్తున్నారు శుభం మూవీ చూసిన జనాలు . కాగా భీమునిపట్నం గ్రామంలో కేబుల్ టీవీ ఆపరేటర్ గా వర్క్ చేస్తూ ఉంటారు శ్రీను అతని ఫ్రెండ్స్ ..వాళ్ళ లైఫ్ అంతా జిల్ జిల్ జిగాక ముందుకెళ్తుంది .

అయితే ముగ్గురు భార్యలు శ్రీవల్లి - ఫరీదా - గాయత్రి కి తెలుగు టెలివిజన్ సీరియల్ అంటే చాలా పిచ్చి.  ఈ సీరియల్ లో ప్రసారమయ్యే సమయంలో ఎవరైనా అడ్డుకుంటే వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాతారు.  అంత పిచ్చి.  అఫ్కోర్స్ రియల్ లైఫ్ లోను అలాంటి భార్యలు ఉన్నారు . అయితే రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే జన్మజన్మల బంధం అనే టీవీ సీరియల్ చూస్తున్నప్పుడు వాళ్ళ భార్యను కదిలిస్తే ఏం జరుగుతుంది అనేది సినిమా కాన్సెప్ట్.  అంతేకాదు మధ్యలో దయ్యం కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు.



సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ తో అదే విధంగా హారర్ ఎలిమెంట్స్ తో చాలా చక్కగా ముందుకు తీసుకెళ్లారు డైరెక్టర్ . అంతేకాదు వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేస్తూ చూసే మూవీ అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా సమంతను ఓ రేంజ్ లో పోగిడేస్తున్నారు . ఈ సినిమాలో సమంత ఇచ్చిన గెస్ట్ అపీరియన్స్ బాగా హైలైట్ గా మారింది . అంతేకాదు సమంత చూస్ చేసుకున్న కాన్సెప్ట్ బాగుందని .. ఆమె ఇలాంటి కాన్సెప్ట్ ఇంకా తెరకెక్కిస్తే బాగుంటుంది అని ..శుభం సినిమా సూపర్ డూపర్ హిట్ అని సమంత ఇండస్ట్రిలో ఒక మంచి ప్రొడ్యూసర్ గా కూడా సెటిల్ అవుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సినిమా తీసిన ప్రతి ఒక్కరు కూడా సినిమా నటీనటుల కన్నా కూడా సమంత పేరుని హైలెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో శుభం సినిమాకి సంబంధించిన రివ్యూ బాగా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: