ఎక్కడికి వెళ్ళినా సరే విక్టరీ వెంకటేష్ ని సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని డైలాగ్స్ తో బాగా ట్రెండ్ చేస్తున్నారు. కాగా విక్టరీ వెంకటేష్ ఇప్పుడు మరొక క్రేజీ కాంబో ని సెట్ చేశారు . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో వెంకటేష్ ఓ సినిమాలో నటించబోతున్నాడు. దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన అయితే రాలేదు కానీ.. పూర్తిగా స్క్రిప్ట్ ని కూడా రెడీ చేసేసారట త్రివిక్రమ్ . రేపో మాపో అఫీషియల్ ప్రకటన కూడా రాబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.
అంతేకాదు సెట్స్ పైకి కూడా ఈ మూవీని త్వరగా తీసుకొచ్చేస్తారు అంటూ ఫిలిం ఇన్సైడ్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది . కాగా ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మించబోతున్నట్లు కూడా తెలుస్తుంది . గతంలో త్రివిక్రమ్ .."వెంకీ" నటించిన నువ్వు నాకు నచ్చావ్ ..మల్లీశ్వరి సినిమాలకు రచయితగా వర్క్ చేశారు . ఆ రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ . మరి ముఖ్యంగా డైలాగ్స్ అయితే ఓ రేంజ్ లో పెలాయి. బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని అందుకున్నాయి. కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకుడిగా మారిన తర్వాత వెంకటేష్ తో కాంబో కుదరడం పై అంచనాలు పెంచేస్తుంది. ఈ క్రేజీ కాంబో కచ్చితంగా టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్ర ను తిరగరాస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు సినీ ప్రముఖులు..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి