కేవలం ఒకే ఒక హిట్ సినిమాతో ఓవర్ నైట్ కే స్టార్ క్రేజీ సంపాదించుకుంది హీరోయిన్ కాయాదు లోహర్.. ప్రదీప్ రంగరాజు డైరెక్టర్ అశ్వత్ మరమత్తు కాంబినేషన్లో వచ్చినటువంటి డ్రాగన్ సినిమాతో ఈ ముద్దుగుమ్మ భారీ క్రేజ్ అందుకున్నది. ఈ ముద్దుగుమ్మ తన నాలుగేళ్ల సినీ కెరియర్ లో నటించిన చిత్రాల కంటే ఇప్పుడు ఎక్కువగా చిత్రాలను నటించడానికి సిద్ధమయ్యింది. డ్రాగన్ తర్వాత కాయాదు సుమారుగా ఆరు సినిమాలకు పైగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. కానీ ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో కూడా వర్ష సినిమాలలో నటిస్తూ ఉన్నది.


హీరో శ్రీ విష్ణు తో అల్లూరి సినిమాతో ఎంట్రీ ఇవ్వగ ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.. కానీ డ్రాగన్ సినిమా సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి తమిళంలో ఇప్పటికే హీరో శింబు నటిస్తున్న 49వ సినిమాలో కమిట్ అయింది అలాగే మరొక సినిమాలో కూడా నటిస్తోందట. వీటికి తోడు జీవి ప్రకాష్ నటిస్తున్న మరొక చిత్రంలో కూడా హీరోయిన్గా ఫిక్స్ అయ్యిందట.ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.


ఇక అలాగే మలయాళంలో నివీన్ పౌలి  సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. తెలుగులో కూడా విశ్వక్ నటిస్తున్న ఫంకీ చిత్రంలో హీరోయిన్గా ఫిక్స్ అయిందని వీటితోపాటు  రవితేజ ప్రొడక్షన్ లో నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. నాని నటిస్తున్న ప్యారడైజ్ సినిమాలో కూడా కాయాదు లోఫర్ ఆల్మోస్ట్ హీరోయిన్గా ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా మొత్తం మీద తెలుగు ,తమిళ్, మలయాళం వంటి భాషలలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది కాయాదు లోహర్. మరి ఈ సినిమాలతో ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అందుకుంటుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: