
రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగిన సమయంలో ఉక్రెయిన్ కు అమెరికా యూరప్ దేశాలు ఆయుధాల విషయంలో సహాయం చేశాయి. అయితే అన్ని ఆయుధాలు ఉన్నా ఉక్రెయిన్ మాత్రం రష్యాపై గెలవలేకపోయింది. 60 దేశాలు ఆయుధాలు ఇచ్చినా ఆ ఆయుధాలను సమర్థవంతంగా వినియోగించుకునే విషయంలో ఆ దేశం ఫెయిలైంది. ఇందుకు అతి ముఖ్యమైన కారణం అనుభవజ్ఞులు రష్యాలో ఉన్న స్థాయిలో ఉక్రెయిన్ లో లేరు.
పాకిస్తాన్ సైతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఒక విధంగా ఇదే పరిస్థితిని ఎదుర్కొంది. కామికాయి డ్రోన్స్ ను ఎలా వాడాలో తెలియక పాకిస్తాన్ టర్కీకి సంబంధించిన సైన్యాన్ని పంపించిందంటే ఆ దేశం పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ డ్రోన్లను టర్కీ సైనికులు ఆపరేట్ చేశారనే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారత్ సైనికులు జరిపిన కాల్పుల్లో టర్కీకి చెందిన ఇద్దరు ముగ్గురు సైనికులు మృతి చెందారని సమాచారం.
మన దేశ ఆర్మీ పాకిస్తాన్ డ్రోన్ ఆపరేటింగ్ సిస్టమ్ పై దాడులు చేసిన సమయంలో టర్కీ వాళ్లు సైతం చనిపోయారు. ఇలాంటి విచిత్రమైన పరిస్థితి అక్కడ నెలకొందని తెలుస్తోంది. పాకిస్తాన్ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా ఆ దేశం అసలు పరిస్థితి మాత్రం ఇదేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ కు భవిష్యత్తులో మరిన్ని షాకులు ఇచ్చే దిశగా భారత్ అడుగులు వేయాల్సి ఉంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు