తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే వారి నటన, అందంతో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అలాంటి వారిలో ప్రముఖ నాటి శ్వేత బసు ప్రసాద్ ఒకరు. ఈ భామ తెలుగులో అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. కొత్త బంగారులోకం సినిమాతో శ్వేతకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కుర్రాళ్ళు ఈ అమ్మాయి కోసమే తన సినిమాలను చూసేవారు. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి ఈ అమ్మడు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించి గుర్తింపు పొందుతున్న సమయంలోనే తన కెరీర్ పై పెద్ద మచ్చ పడింది. 

శ్వేత వ్యభిచారం కూపంలోకి దిగి పోలీసులకు అడ్డంగా దొరికింది. ఓ రాజకీయ నాయకుడితో కలిసి హోటల్ లో పోలీసుల కంటపడింది. ఈ సంఘటన అనంతరం శ్వేతకు సినిమా అవకాశాలు ఎవ్వరు ఇవ్వడానికి ముందుకు రాలేదు. వ్యభిచార కూపంలో శ్వేత ఇరుక్కోవడంతో దాన్నుంచి బయటకు రావడానికి ఆమెకు చాలానే సమయం పట్టింది. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకి శ్వేత రోహిత్ మెట్టల్ అనే ప్రముఖ వ్యాపారవేత్తను ప్రేమించి వివాహం చేస్తుంది. కానీ సంవత్సరం లోపే వీరిద్దరూ విభేదాల కారణంగా విడిపోయారు. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ వైపుకు శ్వేత వెళ్ళింది. ఇండియా లాక్ డౌన్, క్రిమినల్ జస్టిస్ లాంటి పలు వెబ్ సిరీస్ లలో నటించి గుర్తింపును సంపాదించుకుంది.

ఇక శ్వేత ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన అందమైన ఫోటోలు తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది. వరుసగా ఫోటోషూట్లు చేస్తూ వాటిని తన అభిమానులతో పంచుకోగా అవి వైరల్ గా మారుతున్నాయి. ఇదిలా ఉండగా.... శ్వేత ఒకప్పుడు ఎంతో అందంగా, బొద్దుగా, కుందనపు బొమ్మలా ఉండేది. ఇక ఇప్పుడు ఏమైందో తెలియదు పూర్తిగా తన రూపమే మారిపోయింది. బక్క చిక్కి కనిపించింది. పూర్తిగా అందం కోల్పోయి అంద వికారంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ భామను ఎవరు సరిగ్గా పట్టించుకోవడం లేదు. తన అందాన్ని కోల్పోవడంతో సినిమా అవకాశాలు ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రాలేకపోతున్నారు. తనని గుర్తుపట్టడం కూడా చాలా కష్టమైపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: