
సినీనటి ప్రముఖ రాజకీయా నాయకురాలుగా పేరు పొందిన గౌతమి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమలహాసన్ మాజీ ప్రేయసిగా అందరికీ సుపరిచితమే.. కొన్ని కారణాల చేత విడిపోయామంటూ తెలియజేశారు. తాజాగా గౌతమి పోలీసులను ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఇటీవలే చెన్నైలోని పోలీస్ కమిషనర్ దగ్గర ఫిర్యాదు చేసిందట. తన ఆస్తి వివాదానికి సంబంధించి కొంతమంది వ్యక్తులు తనని బెదిరిస్తున్నారు అంటూ ఈ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
తనకు ప్రతిరోజు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని దీంతో తాను ఎక్కువగా ఆందోళనకు గురవుతున్నానంటూ ఈ ఫిర్యాదులు వెల్లడించింది నటి గౌతమి. తనకు తగిన భద్రత కూడా కల్పించాలని పోలీసులను కోరిందట నటి గౌతమి. చెన్నైలోని తనకు రూ.9 కోట్ల రూపాయల విలువచేసే ఆస్తి ఉందని అందుకే చాలామంది తనను బెదిరిస్తున్నారు అంటూ తెలియజేస్తోంది. ఈ ఆస్తిని ఆళకప్పన్ అనే వ్యక్తి ఆక్రమించారంటూ ఆమె ఫిర్యాదులో తెలియజేసిందట. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతున్నదని కోర్టు ఆదేశాల ప్రకారం ఈ వివాదాస్పదమైన భూమిని కూడా సీల్ చేసినట్లు తెలుస్తోంది.
కానీ కొంతమంది అధికారులు లంచం అడుగుతున్నారని మరి కొంతమంది న్యాయవాదులు ఆ స్థలంలో అక్రమంగా నిర్మాణాలను సైతం కూల్చివేయాలంటు ఆమెను బెదిరిస్తున్నారట. మరి కొంతమంది తనకు హాని కలిగించే విధంగా ప్లాన్ చేస్తున్నారనే అనుమానం తనకి వచ్చిందని గౌతమి తెలియజేసింది. అయితే గౌతమి కొన్ని రోజులు బిజెపి కార్యకర్తగా ఉన్నప్పటికీ గత ఏడాది ఏఐఏడీఎంకే పార్టీలో చేరారు. తన ఆస్తి దొంగిలించిన వ్యక్తిని పార్టీ రక్షించడంతో పలు రకాల ఆరోపణలు చేసి బిజెపి పార్టీ నుంచి బయటికి వచ్చింది నటి గౌతమి. దీంతో అప్పటి నుంచి గౌతమికి చాలానే బెదిరింపులు వస్తున్నాయని తెలియజేసింది. ప్రస్తుతం గౌతమి కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నది. మరి ఈ విషయం పైన అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.