తన డ్రెస్సింగ్ గురించి ప్రశ్నించిన ఓ రిపోర్టర్‌కు కోలీవుడ్ నటి మరియు యాంకర్ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది.  తాజాగా ఓ ఈవెంట్ లోనూ రిపోర్టర్ మీరు స్లీవ్ లెస్ వేసుకుంది ఎండ వేడి నుండి ఉపశమనం కోసమా అంటూ సంబంధం లేదని ప్రశ్న అడిగాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఐశ్వర్య రఘుపతి సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో తన దుస్తుల గురించి చర్చించడం ఎందుకు అని ప్రశ్నించింది. ఆ ప్రశ్న ఎందుకు అడిగారో నాకు అర్థం కావడం లేదు అంటూ సమాధానం ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది . 

దీంతో నెటిజన్లు సరిగ్గా సమాధానం ఇచ్చావని ఐశ్వర్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక స్టేజిపైనే రిపోర్టర్ కు ఇచ్చిపడేయడంతో పాటూ ఐశ్వర్య ఇన్ స్టాలోనూ దీనిపై స్పందిస్తూ ఓ సుధీర్ఘ పోస్ట్ పెట్టింది . అందులో ఈ రోజుకు కూడా పురుషులు అహంకారం, దురాభిమానం కలిగి ఉండటం నిరాశ కలిగిస్తుందని ఆ సోషల్ మీడియాలో రాసిన లేఖలో పేర్కొంది. ఒక రిపోర్టర్ లాంటి వ్యక్తి నుండి అలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మరింత నిరాశ కలుగుతుందని చెప్పింది .

ఈ విషయాన్ని మీరు గ్రహించాలని చెప్పింది. వేధికలపై ఇలాంటి ప్రశ్నలు ఎదురుకోవడం ఇదే మొదటి సారి కాదని ఆవేదన వ్యక్తం చేసింది . గతంలో ఓ సినిమా కార్యక్రమంలో నటుడు తనకు దండ వేయడానికి ప్రయత్నించినట్టు గుర్తు చేసింది. ఈ ఘటన కూడా తనను మానసికంగా ఎంతో ప్రభావితం చేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఇలాంటి సందర్భాలు హీరోయిన్లకు, నటీమణులకే కాకుండా హీరోలకు కూడా ఎదురవుతున్నాయి . కొన్నిసార్లు రిపోర్టర్లు తమ వ్యూవ్స్ కోసం హద్దులు మీరి నటీనటులకు ప్రశ్నలు వేస్తున్నారు. దీంతో చాలా మంది అలాంటి వారికి తమదైన రీతిలోనే సమాధానం చెబుతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: