మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ ఏమిటంటే అతని డాన్స్ వాయిస్ అని అంతా ఎక్కువగా చెబుతూ ఉంటారు .. సినిమాల్లో డైలాగ్ ఏదైనా పబ్లిక్ గా అనర్గళంగా డైలాగ్స్ చెప్పటంలో .. ఈ తరం నటిల్లో ఎన్టీఆర్‌ను మించిన హీరో మరోక‌రు లేరు అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు .. పైగా ఎన్టీఆర్ క్విక్ లెర్నర్ ఒక్కసారి డైలాగ్ పేపర్ అలా చూస్తే .. 10 15 నిమిషాల్లో ఎన్ని పేజీలు డైలాగ్లు అయినా ఫాస్ట్ గా ఆయన చెప్పగలడు అని రాజమౌళి తో సహా చాలామంది డైరెక్టర్లు ఎన్నో సందర్భాల్లో చెప్పారు .


స్టూడెంట్ నెంబర్ వన్ , యమదొంగ , రాఖీ వంటి సినిమాల్లో ఎన్టీఆర్ నాన్ స్టాప్ గా చెప్పిన కొన్ని డైలాగులు అభిమానులకు మాత్రమే కాదు చాలామంది స్టార్ హీరోస్ ను కూడా ఎంతగానో మెప్పించాయి .. అంతేకాకుండా మొన్న త్రిబుల్ ఆర్ సినిమాకి సంబంధించిన రామ్ చరణ్ పాత్రను పరిచయం చేస్తూ ‘భీమ్ ఫర్ రామరాజు’ అనే ఇంట్రో  వీడియోకి ఎన్టీఆర్ ఇచ్చిన వాయిస్ ఓవర్ కి అందరూ ఎంతగానో ఫీదా అయ్యారు . అయితే ఇప్పుడు రీసెంట్గా ఎన్టీఆర్ వాయిస్ లో కొంత బేస్ కనిపించడం లేదు .. అలాగే ఆయన చాలావరకు బొంగురు వాయేస్ అనే కామెంట్లు కూడా వస్తున్నాయి .  


దేవర సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ వింటే ఈ మార్పుని ఎవరైనా గమనించవచ్చు .. అలాగే ఈ సినిమాల్లో చాలా చోట్ల ఎన్టీఆర్ వాయిస్ ఎంతో డిఫరెంట్గా మారుతూ వచ్చింది .. అంతేకాకుండా తాజాగా వచ్చిన వార్ 2 టీజ‌ర్ లో కూడా ఎన్టీఆర్ వాయిస్ కొంత అర్థం కాని బొంగురుగా అనిపించింది . అయితే దీంతో ఎన్టీఆర్ వాయుస్ కు ఏమైంది అని అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్న పరిస్థితి .  అయితే ఇందులో కొంతమంది యంటీ అభిమానులు అయితే ట్రోలింగ్ ను కూడా మొదలుపెట్టారు .  అయితే ఇటీవల ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్ లో కూడా అలాగే అర్జున్ సన్నాఫ్ వైజయంతి  ప్రీ రిలీజ్ ఈవెంట్లలో కూడా ఎన్టీఆర్ వాయిస్ బాగానే ఉంది .. మరి ఈ తేడా ఎక్కడ వస్తుంది అనేది మాత్రం ఎవరికీ అర్థం కావటం లేదు ..



మరింత సమాచారం తెలుసుకోండి: