
పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించి కొన్ని మార్పులు కావాలని పవన్ కళ్యాణ్ కోరగా త్రివిక్రమ్ శ్రీనివాస్ హరీష్ పవన్ కు అభిమాని కాబట్టి ఎలా చూపించాలో తెలుసని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
పవన్ త్రివిక్రమ్ కాంబోలో మూవీ రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నా ఇప్పట్లో ఈ కాంబినేషన్ సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీ కాంబో మూవీ ఉందో ఆగిపోయిందో కూడా క్లారిటీ లేదు. ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ ను షేక్ చేసే కాంబినేషన్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ త్రివిక్రమ్ రెమ్యునరేషన్ పరంగా ఒకింత టాప్ రేంజ్ లో ఉన్న సంగతి తెలిసిందే.
పవన్ త్రివిక్రమ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో మరిన్ని రికార్డులను క్రియేట్ చేసి తన స్థాయిని పెంచుకుంటారేమో చూడాల్సి ఉంది. పవన్ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. హరిహర వీరమల్లు ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.