కన్నడ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన అద్భుతమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా “కాంతార 1” ప్రస్తుతం అన్ని భాషల్లోనూ సంచలనం సృష్టిస్తోంది. రిషబ్ శెట్టి స్వయంగా హీరోగా నటిస్తూ, దర్శకుడిగా కూడా వ్యవహరించిన ఈ సినిమా రిలీజ్‌కి ముందే భారీ అంచనాలతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే థియేటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఉన్న హైప్ మరింత స్పెషల్ గా మారింది.


తెలుగులో కూడా కన్నడ వెర్షన్‌తో పాటు రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజే నైజాం మార్కెట్‌లో సాలిడ్ ఓపెనింగ్స్ అందుకుంది. రిలీజ్ డే నాడు 3.8 కోట్ల షేర్ వసూలు చేస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. రెండో రోజు ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ కనబరిచింది. రెండో రోజు వసూళ్లు 3.9 కోట్ల షేర్ (జీఎస్టీ మినహాయించి) రాబట్టడం విశేషం. సాధారణంగా ఏ సినిమా అయినా రెండో రోజుకి వసూళ్లు తగ్గిపోవడం కామన్. కానీ “కాంతార 1” మాత్రం రివర్స్ ట్రెండ్ చూపించడం ట్రేడ్ సర్కిల్స్ కే షాక్ ఇచ్చింది.


ఇప్పుడు వీకెండ్‌కి అడుగుపెడుతున్న తరుణంలో ఈ వ‌సూళ్లు మ‌రింత పెరిగే ఛాన్సులు ఉన్నాయి. రిషబ్ శెట్టి నటన, దర్శకత్వం, కథలోని డివోషనల్ టచ్, రుక్మిణి వసంత్ ఆకట్టుకునే ప్రెజెన్స్, అజనీష్ లోకనాథ్ ఇచ్చిన అద్భుతమైన సంగీతం సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్‌గా మారాయి. హోంబళే ఫిల్మ్స్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో హంగామా చేస్తోంది. నైజాం వసూళ్లే ఈ స్థాయిలో ఉంటే, ఆంధ్రా మరియు ఇతర ప్రాంతాల్లో కూడా రెస్పాన్స్ బలంగానే ఉందని టాక్.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: