మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి ఆశకా రంగనాథ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కొంత కాలం క్రితం కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన అమిగొస్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దానితో ఈ సినిమా ద్వారా ఆశిక కి కూడా తెలుగు సినీ పరిశ్రమలో గొప్ప గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత కొంత కాలానికి ఈమె నాగార్జున హీరో గా రూపొందిన నా సామి రంగ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది.

సినిమా మంచి విజయం సాధించడం , ఇందులో ఈ బ్యూటీ తన అందాలతో , నటలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి "విశ్వంభర" అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. త్రిషమూవీ లో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... మల్లాడి వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఆశకా రంగనాథ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అశిక ఆ ఇంటర్వ్యూలో భాగంగా విశ్వంభర సినిమాలో తన పాత్రకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలను తెలియజేసింది.

తాజాగా ఆశిక  "విశ్వంభర" మూవీ గురించి మాట్లాడుతూ ... విశ్వంభర సినిమాలో నేను ఒక మహిళ యోధురాలి పాత్రలో కనిపించబోతున్నాను. నేను మొట్ట మొదటి సారి నా కెరియర్లో భారీ గ్రాఫిక్స్ ఉన్న సినిమాలో నటిస్తున్నాను. ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకుంటుంది. ఈ సినిమా ద్వారా నాకు గొప్ప గుర్తింపు లభిస్తుంది అని ఆశిక తాజా ఇంటర్వ్యూ లో బాగంగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: