
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ , క్రిష్ జాగర్లమూడి సంయుక్తంగా తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు. దాదాపు ఐదు సంవత్సరాల క్రితం షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా ఎట్టకేలకు ఎన్నో అవాంతరాలు దాటుకుని ఈ జూన్ 12న థియేటర్ల లోకి దిగుతోంది. మెగా సూర్య మూవీస్ ప్రొడక్షన్ బ్యానర్ పై అగ్ర నిర్మాత ఏఎం. రత్నం ఈ సినిమాను నిర్మించారు. వాస్తవానికి ఈ సినిమా విషయం లో ముందు నుంచి పవన్ అభిమానులకు పెద్దగా ఆశలు లేవు. ఎప్పుడు అయితే రిలీజ్ డేట్ ప్రకటించారో అప్పటి నుంచి అనూహ్యంగా రోజు రోజుకు అంచనాలు అయితే విపరీతంగా పెరిగి పోతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం గట్టి పోటీ కూడా నెలకొంది.
మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి గా ఉండడంతో అక్కడ ఈ సినిమా హక్కులు దక్కించుకు నేందుకు ఏరియాల వారీ పోటీ అయితే మామూలుగా లేదు. ఈ సినిమా ప్రమోషన్లు కూడా ఇప్పటికే ప్రారంభ మయ్యాయి. ఒక్కో సాంగ్ వరుసగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నైజాం హక్కుల కోసం రెండు బడా డిస్ట్రిబ్యూషన్ సంస్థల మధ్య గట్టి పోటీ నెలకొన్నట్టు తెలుస్తోంది. నైజాం లో హరిహర వీరమల్లు కోసం ఆల్రెడీ సితార వారు రేస్ లో ఉన్నారనే బజ్ ఉండగా ... ఇపుడు మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ వారు కూడా రేసులోకి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో నైజాం మార్కెట్ లో వీరమల్లు ఎవరికి సొంతం అవుతుందో అన్న ఆసక్తి నెలకొంది. ఇక నైజాం లో అగ్ర పంపిణీ దారులుగా ఉన్న దిల్ రాజు, సురేష్ బాబు, ఏసియన్ సునీల్ కు ఈ సినిమా హక్కులు వెళ్లడం లేదనే తెలుస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు