బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లో దీపికా పదుకొణె ఒకరు. తాజాగా ఈమె ఓ ఫ్యాషన్ షోలో కనిపించారు. ఫ్యాషన్ షో అనంతరం దీపికా మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన గురించి ప్రత్యేకమైన విషయాలు కొన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. సమస్యలు ఎదురైన ప్రతీసారి మనసు చెప్పే మాటలు వింటనని తెలిపింది. ఆ తర్వాతే తన నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పుకొచ్చింది. పరిస్థితులు ఎలా ఉన్నా సరే తను ఎప్పుడు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే జీవితంలో బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలంటే ముందు నిజాయితీగా ఉండడం ముఖ్యమని వెల్లడించింది. తను ఎక్కువ ప్రాధాన్యత నిజాయితీకే ఇస్తానని తెలిపింది.

దీపికా పదుకొణె2006లో ఐశ్వర్యా అనే సినిమాలో నటించింది. ఈ సినిమా కనడ సినిమా. ఈ సినిమాకు హీరోగా ఉపేంద్ర నటించారు. ఆ తర్వాత 2007లో షారుక్ ఖాన్ హీరోగా నటించిన ఓం శాంతి ఓం సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాదు ఈ సినిమా ద్వారా చాలా అవార్డులను సొంతం చేసుకుంది. బచ్న ఏ హాసినో సినిమాలో నటించింది. చాందిని, బిల్లు, లవ్ అజ్, కల్, చపాక్, పఠన్ సినిమాలలో నటించి మంచి ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఈ బ్యూటీ అందం గురించి మాట్లాడుకోవాల్సిన పనిలేదు.

దీపికా పదుకొణే మొదట మోడలింగ్ ని ఎంచుకుంది. కానీ తర్వాత లిరిల్, డాబర్, లాల్ పౌడర్, క్లోజప్ టూత్ పేస్ట్, లిమ్కా అనే ప్రముఖ ఉత్పత్తుల ప్రకటనల్లో నటించింది. ఈమె కింగ్ ఫిషర్ ఫ్యాషన్ అవార్డులలో మోడల్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా సొంతం చేస్తుంది. దీపికా పదుకొణే 2018లో రణవీర్ సింగ్ ని వివాహం చేసుకుంది. ఈ భామ ఇటీవల విడుదలైన కల్కి సినిమాలో కూడా నటించింది. ప్రభాస్ నటించిన కల్కి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: