
ఈ సినిమాకు మహాభారతం సీరియల్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ దర్శకత్వం వహించారు. మోహన్ లాల్, మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా స్టీఫెన్ పనిచేస్తున్నారు. ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మించారు. కన్నప్ప సినిమాలో అక్షయ్ కుమార్ శివయ్యగా, కాజల్ పార్వతిగా, ప్రభాస్ రుద్రుడిగా, మోహన్ బాబు మహాదేవ శాస్త్రిగా, శివ బాలాజీ కుమారదేవ శాస్త్రిగా, రఘుబాబు మల్లు పాత్రలో కనిపించనున్నారు.
ఇక ఈ సినిమా పోస్టర్ లు, టీజర్ లు కూడా ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. ఈ సినిమా పాటలు కూడా మంచి స్పందన పొందాయి. దీంతో కన్నప్ప మూవీపైన ప్రేక్షకులు మరింత అంచనాలు పెరిగాయి. ఈ సినిమా కోసం మూవీ మేకర్స్ చాలానే ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటుగా తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ కానుంది. ఇటీవలే కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్ మిస్ అయిందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సినీ ఇండస్ట్రీలో గందరగోళం మొదలైంది. ఇక ఏం జరుగుతుందో చూడాలి.