తాజాగా ఎస్ వి కృష్ణారెడ్డి బర్త్డే వేడుకల్లో ఇండస్ట్రీకి సంబంధించి ఆయనతో సినిమాలు చేసిన చాలా మంది నటీనటులు పాల్గొన్నారు.ఇందులో రోజా, ఆమని, రాజేంద్రప్రసాద్, కామెడియన్ అలీ,శ్రీకాంత్, మురళీమోహన్, ఇంద్రజ,రవళి,శివాజీ రాజా వంటి నటినటులు పాల్గొన్నారు. అయితే ఈ బర్త్డే వేడుకల్లో రాజేంద్రప్రసాద్ వేదిక మీద మాట్లాడుతూ ఆలీని బండ బూతులు తిట్టారు.లం** కొడకా అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. అలాగే మురళీమోహన్ ని నీకు సిగ్గు లేదు అంటూ మాట్లాడారు. అంతేకాకుండా రోజా ని ఏమే నిన్ను నేనే ఇండస్ట్రీకి పరిచయం చేశాను కదా అంటూ మాట్లాడారు. ఇలా అక్కడికి వచ్చిన చాలామందిపై బూతు పదజాలం వాడి రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. వీరందరిలో ఎక్కువగా కమెడియన్ అలీ ని ఉద్దేశించి మాట్లాడిన బూతు పదం వైరల్ అవ్వడంతో పాటు సోషల్ మీడియాతో పాటు మెయిన్ మీడియాలో కూడా పెద్ద రచ్చ జరిగింది. 

ఇక ఈ విషయంపై రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. నేను మాట్లాడిన ప్రతిదాన్ని ఇలాగే వక్రీకరిస్తున్నారు. ఇక మీ కర్మ అంటూ అన్నారు.అయితే తాజాగా రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై ఆలీ స్పందించారు. రాజేంద్రప్రసాద్ గారు చాలా పెద్దమనిషి.. ఆయన ఈ మధ్యనే తల్లి లాంటి కూతుర్ని పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ఆయన ఏం మాట్లాడినా కూడా నేను సరదాగానే తీసుకుంటాను. ఏదో ఒక మాట అలా తూలారు. దానికే మీడియా పెద్ద రచ్చ చేస్తుంది. ఇప్పటితో ఈ విషయాన్ని మీడియా వాళ్ళు మర్చిపోతే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఏదో మాట తూలి అలా అన్నారు.దాన్ని ఇంకా పెద్దది చేయకండి. 

ఆయన పెద్దాయన అంటూ రాజేంద్రప్రసాద్ మాట్లాడిన మాటల్ని సమర్థిస్తూ ఆలీ మాట్లాడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. అంత పెద్ద మాట అంటే ఆలీ ఏంటి ఇలా సింపుల్ గా తీసేసి మళ్లీ రాజేంద్ర ప్రసాద్ ని సమర్థిస్తున్నారు అని కామెంట్లు పెడుతున్నారు. అయితే రాజేంద్రప్రసాద్ తో ఆలీకి ఎంత అనుబంధం ఉంటే ఆయన లైవ్ లో అలా తిడతారు. వారి మధ్య బాండింగ్ ఉండగా మీడియా ఎందుకు రచ్చ చేయడం అని మరికొంతమంది మాట్లాడుకుంటున్నారు.ఏది ఏమైనప్పటికీ ఆలీ స్వయంగా వచ్చి స్పందించడంతో రాజేంద్రప్రసాద్ పై వచ్చిన విమర్శలకు పులి స్టాప్ పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: