
బీజేపీ సీనియర్ నేత, మంత్రి కైలాశ్ విజయ్ వర్గీయ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విదేశీ ఆచారమైన ఈ ధోరణి మన దేశ సాంప్రదాయానికి విరుద్ధమని ఆయన చెప్పుకొచ్చారు. తాను మహిళలను దేవతా రూపంగా చూస్తానని ఆయన కామెంట్లు చేశారు. ఇండోర్ లో జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.
నిండైన దుస్తులతో సింగారించుకునే మహిళను మనం అందానికి ప్రతిరూపంగా చూస్తామని మంత్రి అన్నారు. విదేశాలలో మాత్రం మహిళలు ఎంత తక్కువ దుస్తులు ధరిస్తే అంత అందంగా చూస్తారని చెప్పుకొచ్చారు. మంత్రి మాటలకు సభికులు సైతం చప్పట్లతో అభినందించడం గమనార్హం.
అమ్మాయిలు సైతం తనతో సెల్ఫీలు దిగడానికి వస్తారని మొదట నిండైన దుస్తులు ధరించి ఆ తర్వాత సెల్ఫీల కోసం రావాలని తాను వాళ్లకు చెబుతానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కామెంట్లు వివాదాస్పద కామెంట్లు కాగా ఈ కామెంట్ల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మహిళలు అలాంటి దుస్తులు ధరించడాన్ని ఒప్పుకోనని చేసిన కామెంట్లపై పిటిషన్లు దాఖలు అవుతాయేమో చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు