
ముఖ్యంగా తమిళ బాలీవుడ్ స్టార్ వంటి వారు ఇందులో నటిస్తూ ఉన్నారు. తాజాగా ఓజి సినిమాకి సంబంధించి తమిళ స్టార్ అర్జున్ దాస్ పాల్గొన్నట్లుగా పవన్ కళ్యాణ్ తో దిగిన ఒక ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ తో సరదాగా సెల్ఫీ తీసుకున్న ఫోటోలను కూడా షేర్ చేస్తూ.. మీతో పని చేయడం చాలా గౌరవంగా ఉన్నది మీద పనిచేసిన ప్రతిరోజు కూడా ఎంజాయ్ చేశాము.. మీ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని కూర్చోబెట్టుకొని మాట్లాడినందుకు థాంక్యూ సార్ అంటూ తెలియజేశా.
ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ ఓజీ లుక్స్ లో బ్లాక్ దుస్తులలో పవన్ కళ్యాణ్ కనిపించారు. అర్జున్ దాస్ కూడా నవ్వుతూ ఈ ఫోటోలకు స్టిల్ ఇచ్చినట్లు కనిపిస్తోంది దీంతో పవన్ ఫ్యాన్స్ ఈ ఫోటోలను వైరల్ చేస్తూ ఉన్నారు. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతోంది. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఇమ్రాన్ హస్మి విలన్ గా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ షర్ట్ లెస్ సన్నివేశాలలో కూడా నటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి ఒక్క అప్డేట్ కూడా సినిమాకి బాగా క్రేజ్ తెచ్చి పెట్టింది.