
కానీ ఆరో కుమారుడైన బాలయ్య మాత్రం ఎన్టీఆర్ వారసత్వాన్ని నటనపరంగా కొనసాగిస్తూ ఉన్నారు. సీనియర్ ఎన్టీఆర్ తెరకెక్కించిన తాతమ్మ కల అనే సినిమా ద్వారా బాలయ్య ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ బాలయ్య కోసం కొన్ని చిత్రాలను రూపొందించారు. ఒకవైపు చదువుతూనే మరొకవైపు సినిమాలు చేసిన బాలయ్య పాతికేళ్ల వయసులోనే బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు. అప్పట్లో మంగమ్మగారి మనవడు, ముద్దుల మామయ్య సినిమాలు బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచాయి టాలీవుడ్లో.
అలాగే ఆదిత్య 369 సినిమాతో మొట్టమొదటిసారిగా ఒక టైమ్ ట్రావెల్ కథను ఎంచుకొని మరి చేశారు బాలయ్య. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో 100 చిత్రాలను పూర్తి చేశారు. బాలయ్య కెరియర్లో డిజాస్టర్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. బాలకృష్ణ ఇప్పటికీ మాస్ స్టైల్ లోనే కమర్షియల్ చిత్రాలు చేస్తూ అభిమానులను మెప్పిస్తూ ఉన్నారు. బాలయ్య నుంచి మాస్ డైలాగులు రాకపోతే అభిమానులు తీవ్ర నిరుత్సాహపడుతూ ఉంటారు. అందుకే దర్శక ,నిర్మాతలు దృష్టిలో పెట్టుకొని బాలయ్య స్టైల్ కి తగ్గట్టుగా డైలాగులు రాస్తూ ఉంటారు. ఈరోజు బాలకృష్ణ పుట్టినరోజు తెలుసుకొని హంగామా చేస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్.. బాలకృష్ణ పొలిటికల్ గానే కాకుండా బసవతారకం పేరుతో క్యాన్సర్ హాస్పిటల్ ని స్థాపించి ఎంతో మందికి సహాయం చేస్తూ ఉన్నారు.