
వేరే హీరోలకి బిగ్ ఫ్లాప్ ఇచ్చిన బోయపాటి బాలయ్యకు మాత్రం కెరియర్ లో గుర్తుండిపోయే సినిమాలను హిట్గా మలిచాడు . మరీ ముఖ్యంగా అఖండ 2 టీజర్ పై సోషల్ మీడియాలో ఇప్పుడు ఎలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయో అందరికీ తెలుసు. ఒక్కొక్క షాట్ బాలయ్య లోని వేరే యాంగిల్ ను బయటపెట్టింది అని ఇలాంటి షాట్స్ వేరే హీరోలు చేస్తే ట్రోల్లింగ్ కి గురయ్యేవారు అని .. కానీ బాలయ్య చేయడం వల్ల ఆ షాట్స్ కి అందం వచ్చిందని .. ఓ రేంజ్ లో ప్రశంసిస్తున్నారు జనాలు .
కాగా ఈ టీజర్ లో ఓ షాట్లో ఒక వ్యక్తి కళ్ళు మాత్రమే కనిపిస్తాయి . చాలా భయంకరంగా చాలా క్రూరంగా చాలా హైలెట్గా ఈ టీజర్ కి ఆ కళ్ళు ప్లస్ గా మారాయి . అయితే అతడు ఎవరు..? అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే ఈ చిత్రంలో విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నాడు . ఇవి ఆయన కళ్ళే అని అంటున్నారు సినీ ప్రముఖులు. కొంతమంది ఆయన అభిమానులు ఆ కళ్ళను బట్టి చూస్తుంటే ఇందులో అఘోరా క్యారెక్టర్ గా చేసినట్లు అనిపిస్తుంది అని.. ఇద్దరి అఘోరాల మధ్య జరిగే యుద్ధంగానే ఈ అఖండ 2 ని తెరకెక్కించాడు ఏమో బోయపాటి శ్రీను అని మాట్లాడుకుంటున్నారు . బాలయ్య బాబు మంచివైపు ఉండే అఘోరగా ..ఆది పినిశెట్టి దుష్టశక్తుల వైపు ఉండే అఘోరగా ఈ సినిమాలో చూపించబోతున్నట్లు టీజర్ ఆధారంగా తెలిసిపోతుంది. సోషల్ మీడియా ప్రజెంట్ అఖండ 2 సినిమా టీజర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది..!!