మంగ్లీ.. సింగర్ మంగ్లీ.. ఎవరి సహాయం లేకుండా అసలు బ్యాక్ గ్రౌండ్ నే లేకుండా ఫోక్ సింగర్ గా తనకంటూ స్పెషల్ స్టేటస్ సంపాదించుకుంది . మరీ ముఖ్యంగా సింగర్ మంగ్లీ పేరు చెప్తే కామన్ పీపుల్స్ తో పాటు స్టార్ సెలబ్రిటీస్ కూడా ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపించేస్తూ ఉంటారు . అంత టాలెంటెడ్. కేవలం సినిమా పాటలే కాదు కొన్ని ప్రైవేట్ పాటలు అలాగే పొలిటిషియన్స్ కి సపోర్ట్ చేస్తూ కూడా స్టేజ్ ఎక్కి పాటలు పాడేస్తూ అదరగొట్టేస్తుంటుంది.


కేవలం మంగ్లీ పాట కారణంగానే హిట్ అయిన సినిమాలు కూడా బోలెడు ఉన్నాయి . అలాంటి మంగ్లీ రీసెంట్గా ఊహించని  చిక్కుల్లో ఇరుక్కుంది . అసలు మంగ్లీ పై ఇలాంటి వార్తలు వినాల్సి వస్తుంది అంటూ అభిమానులు కూడా ఊహించలేకపోయారు.  ఆమె తన బర్త్డ డే నాడు ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేసుకుంది. అయితే ఆ పార్టీకి ఎటువంటి పర్మిషన్ లేకపోవడం .. ఆ పార్టీలో  భారీ ఎత్తున విదేశీ మద్యంతో పాటు డ్రగ్స్ దొరకడం పార్టీకి వెళ్లిన వాళ్లని టెస్ట్ చేయగా  కొందరికి డ్రగ్స్ పాజిటివ్ రావడం సంచలనంగా మారింది .



దీనిపై మంగ్లీ పై కేసు కూడా నమోదయింది.  అయితే మంగ్లీ మాత్రం నాకు ఏమీ తెలియదు అని నేను తెలిసి తెలిసి ఎందుకు తప్పు చేస్తాను అంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది. " నా పుట్టిన రోజు సందర్భంగా మా అమ్మ నాన్న  కోరిక మేరకు ఒక పార్టీ ఇచ్చాను..  ఇందులో కేవలం నా స్నేహితులు ..సన్నిహితులు .. తల్లిదండ్రులు.. కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. అందరూ నాకు కావాల్సిన వాళ్ళే.. మందు ఉంది కానీ మీరు అంటున్నట్టు విదేశీ మందు కాదు డ్రగ్స్ అసలు వాడడం గురించే మాకు తెలియదు .. మందు లోకల్ గా మాత్రమే తెప్పించాము.. లోకల్ మందు ..సౌండ్ సిస్టంకి పార్టీకి పర్మిషన్ తీసుకోవాలి అని నాకు తెలియనే తెలియదు.. తెలిస్తే ఖచ్చితంగా తీసుకుంటాను .. లేకపోతే ఎందుకు ఈ విధంగా తప్పు చేస్తాను..??'  అంటూ తన తప్పుని కప్పి  పుచ్చుకునే ప్రయత్నం చేసింది అని.. మంగ్లీని ఘాటుగా విమర్శిస్తున్నారు నెటిజన్స్.



సినీ స్టార్స్ తో పార్టీలకి వెళ్తావు. నిరంతరం వాళ్ళతో టచ్ లో ఉంటావు. బడా బడా  పొలిటీషియన్స్ కి పాటలు పాడుతావు.  మరి అలాంటి నీకు ఈ మాత్రం తెలీదా..? ఒక పార్టీ చేసుకోవాలి అంటే పర్మిషన్ ఉండాలి అన్న మినిమం కామన్ సెన్స్ లేదా ..? అంటూ ఘాటు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. అయిన లోకల్ మందు ఉంది అని ఒప్పుకున్నావ్..? నువ్వు మందు తాగుతావా..? అంటూ  కొంతమంది ఇది మంగ్లీ నిజస్వరూపమని ఆమె పైకి కనిపించే అంత సాఫ్ట్ కాదు అని .. బర్త డే  పార్టీలో లీకైన వీడియో ఆధారంగా చెబుతున్నారు . ఆ వీడియోలో ఎవరో వీడియో రికార్డ్ చూస్తుంటే ఆమె తీయొద్దు వీడియో ఆపండి ఆపండి అంటూ గట్టిగా మాట్లాడిన క్లిప్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారాయి.  ఈ క్రమంలోనే మంగ్లీని ఘాటుగా విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు జనాలు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: