
ప్రెసెంట్ రాజమౌళి - మహేష్ బాబు తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు . ఈ సినిమా గురించి ఏ ఒక్క చిన్న అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియా మొత్తం దద్దరిల్లిపోతుంది అలా ఉంటుంది రియాక్షన్ . తాజాగా ఈ సినిమా నుంచి ఒక కీలకమైన విషయం లీకై వైరల్ గా మారింది. ఎస్ ఎస్ ఎం బి 29లో కీలకమైన ఇంట్రడక్షన్ సీను ఆఫ్రికా దేశమైనా కెన్యాలో చిత్రీకరించబోతున్నట్లు సమాచారం అందుతుంది . దీనికోసం దాదాపు 30 కోట్లు ఖర్చుపెట్టబోతున్నారట రాజమౌళి.
ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఇంకా ఇద్దరు హీరోయిన్లు కూడా ఉన్నారట . అయితే మహేష్ ఇండక్షన్ సీన్ కోసం కెన్యాలో భారీ గా ఒక సెట్ ని కూడా ఏర్పాటు చేయబోతున్నారట . మహేష్ ఇంట్రడక్షన్ సీన్ తో పాటే ప్రియాంక చోప్రా కి సంబంధించిన కొన్ని సీన్స్ కూడా ఈ సెట్స్ లో చిత్రీకరించబోతున్నారట . కాగా గతంలో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో ఎన్టీఆర్ ని ఏ విధంగా అయితే ఇంట్రడ్యూస్ చేస్తూ చాలా రియలిస్టిక్ గా ఎమోషనల్ గా పరిచయం చేశారో..సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా రన్నింగ్ చేజింగ్ సీన్ లోనే మహేష్ బాబును పరిచయం చేయబోతున్నారట . రాజమౌళి ఏం చేసినా సరే పర్ఫెక్ట్ ప్లానింగ్ తో చేస్తాడు అందులో నో డౌట్. మహేష్ ఈ సినిమాతో మరో లెవెల్ నటుడుగా గుర్తింపు సంపాదించుకోవడం పక్క అంటున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్ . ఈ సినిమా లో హాలీవుడ్ స్టార్స్ కూడా ఉండబోతున్నట్లు సమాచారం అందుతుంది . గ్లోబల్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని రూపొందుతున్న ప్రాజెక్ట్ ఇది. అందుకే ఈ సినిమా పై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి..!