
ఈ విషయం అటు ఇండస్ట్రీలో తెగ వైరల్ గా మారడంతో పాటుగా చాలామంది ట్రోల్స్ చేయడంతో పాటుగా సినిమాలు ఫ్లాప్ అయితే మిగతా హీరోలు ఏమైనా డబ్బులు ఇచ్చారా అంటూ మెగా హీరోల పైన నిందలు వేస్తున్నారనే విధంగా కామెంట్స్ చేశారు. ఈ ఇంటర్వ్యూ వల్ల దిల్ రాజు బ్యానర్ కు కూడా చాలా డ్యామేజ్ జరిగిందని ఇప్పుడు ఆ డ్యామేజ్ ని కంట్రోల్ చేసే పనిలో నిర్మాత దిల్ రాజు పడ్డట్టుగా తెలుస్తోంది.
మొదట తమ్ముడు చిత్రం ప్రమోషన్స్ లో ఈ వివాదం గురించి దిల్ రాజు మాట్లాడగా చరణ్ తో తమకు చాలా అనుబంధం ఉన్నదని ఆయనతో కలిసి మరొక సినిమా కూడా చేస్తామంటూ వెల్లడించారు. అయిపోయిన చిత్రం గురించి మాట్లాడటం కూడా అనవసరం అంటూ తెలిపారు. కానీ తన తమ్ముడు శిరీష్ మాట్లాడిన మాటలకు తిరిగి మళ్లీ క్షమాపణలు చెబుతూ రామ్ చరణ్ వివాదం పైన ఎవరి మనోబాలైనా దెబ్బతిని ఉంటే క్షమించండి అంటూ ఒక ప్రెస్ నోట్ ని విడుదల చేశారు. తాను మాట్లాడిన మాటలను సోషల్ మీడియా ద్వారా చాలామంది అపార్థం చేసుకున్నారని కొంతమంది మెగా అభిమానులు కూడా బాధపడినట్లుగా తెలుస్తోంది.. గేమ్ ఛేంజర్ చిత్రం కోసం రామ్ చరణ్ తమ పూర్తి సమయం, సహకారం కూడా అందించారు. చిరంజీవి గారి కుటుంబం అంటే మాకు ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉంది.. తాను మెగా హీరోల ప్రతిష్టను భంగం కలిగించే విధంగా మాట్లాడాను ఒకవేళ నా మాటలు తప్పుగా అర్థం చేసుకొని ఉంటే క్షమించండి అంటూ తెలిపారు.