
మనకు తెలిసిందే రన్బీర్ కపూర్ రాముడిగా సాయిపల్లవి సీతగా అత్యంత ప్రతిష్టాత్మకంగా "రామాయణం" సినిమా రూపొందుతుంది . ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి . కాగా రీసెంట్ గానే మొదటి భాగం సినిమా షూటింగ్ పూర్తయినట్లు ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. అంతేకాదు ఈ సినిమా గ్లిమొస్ అండ్ టైటిల్ లోగోని కూడా రిలీజ్ చేయబోతున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో తెగ ట్రెండ్ అవుతుంది. కాగా ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది .
నిజానికి ఈ సినిమాలో ముందుగా రాముడి క్యారెక్టర్ లో రామ్ చరణ్ ని అనుకున్నారట మూవీ మేకర్స్. సీత పాత్ర కోసం అలియా భట్ అనుకున్నారట . ఆల్రెడీ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఈ కాంబో సూపర్ సక్సెస్ అయింది. అలానే మేకర్స్ ప్లాన్ చేశారట . రామ్ చరణ్ కూడా ఓకే చేశారట. కానీ లాస్ట్ మినిట్ కొందరు బాలీవుడ్ పెద్దలు మన సినిమాలో బాలీవుడ్ హీరో కాకుండా ..తెలుగు హీరో ఏంటి...?? అంటూ ఆయనను ఈ సినిమా నుంచి తప్పించేశారట. ఇలా జరుగుతుందని ఫ్యాన్స్ ముందు గానే ఊహించారు. అనుకున్నట్లే జరిగింది. ఇక ఆ తరువాత ఆలియా భత్ కూడా కాల్ షీట్స్ బిజీగా ఉన్న కారణంగా రిజెక్ట్ చేసిందట. ఆ తర్వాత చాలామంది హీరోలు హీరోయిన్లను అనుకున్నా. ఫైనల్లీ రాముడు పాత్రలో రణ్బీర్ కపూర్ సీత పాత్రలో సాయి పల్లవి సెలెక్ట్ అయ్యారు . మొత్తానికి వీళ్ళ కాంబో చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!