ఇండస్ట్రీలో దిగ్గజ నటుడిగా పేరు తెచ్చుకున్న కోట శ్రీనివాసరావు మరణం ఎంతో మందిని కలిచి వేసింది.ఈయన మరణ వార్త విని కుటుంబం విషాదంలోకి వెళ్లిపోయింది. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా కోటా శ్రీనివాసరావు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. విభిన్న పాత్రలు పోషించి దిగ్గజ నటుడిగా పేరు తెచ్చుకున్న కోటా శ్రీనివాసరావు 83 ఏళ్ల వయసులో మరణించారు.కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న కోట శ్రీనివాసరావు ఎలా ఉన్నారో చాలామందికి తెలియదు. కానీ రీసెంట్ గా బండ్ల గణేష్ ఆయన ఇంటికి వెళ్లి కలవడంతో ఆ ఫోటో కాస్త బయటకు వచ్చింది.ఈ ఫోటో బయటపడ్డ సమయంలో చాలామంది అసలు కోట శ్రీనివాసరావుకి ఏమైంది..ఏంటి ఇలా మారిపోయారని చాలామంది ఆశ్చర్యపోయారు. 

అయితే వృద్ధాప్యం కారణంగా వచ్చిన అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు.అయితే అలాంటి కోట శ్రీనివాసరావు జీవితంలో ఎన్నో విషాదాలు, వివాదాలు, సంతోషాలు ఇలా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. ఇందులో ఒకటి సీనియర్ ఎన్టీఆర్ అభిమానుల చేతుల్లో తన్నులు తినడం.ఇక విషయంలోకి వెళ్తే.. కోట శ్రీనివాసరావుకి సీనియర్ ఎన్టీఆర్ గారికి మంచి అనుబంధమే ఉంది.కానీ అప్పట్లో ఎన్టీఆర్ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా టిడిపి పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు.అదే సమయంలో కాంగ్రెస్ కృష్ణని దగ్గరికి తీసుకొని తమ పార్టీలో చేర్చుకున్నారు. అలా సూపర్ స్టార్ కృష్ణ కి అప్పటివరకు ఎన్టీఆర్ తో మంచి అనుబంధమే ఉండేది. కానీ కాంగ్రెస్ లోకి వెళ్లాక సీనియర్ ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా సినిమాలు,డైలాగులు చేసారు.అలా మండలాదీషుడు సినిమా కృష్ణ చేసినప్పుడు ఆ సినిమాలో కోట శ్రీనివాసరావుని తీసుకున్నారట.

ఇక అందులో కోటా శ్రీనివాసరావు సీనియర్ ఎన్టీఆర్ ని ధిక్కరించేలా డైలాగులు,హావభావాలు ఆయనలా యాక్టింగ్ చేయడం, అనుకరించడంతో కోటపై అన్నగారి అభిమానులు విరుచుకుపడ్డారు. అయితే ఈ సినిమాలో కోట నటనకి చాలామంది ఫిదా అయ్యారు. కానీ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం దొరికితే చితక్కొట్టాలి అనే రేంజ్ లో కోపంతో ఉన్నారు.ఆ సమయంలో ఓసారి కోట శ్రీనివాసరావు హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చారట. అయితే అప్పటికే విజయవాడలో సీనియర్ ఎన్టీఆర్ రావడంతో అక్కడికి టిడిపి కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు ఎంతోమంది గుమిగుడారట. ఇక అసలు విషయం తెలియని కోట శ్రీనివాసరావు భయంతో బిక్కుబిక్కుమని వెళుతున్న టైం లో అందులో ఉన్న ఓ వ్యక్తి కోట ని గుర్తుపట్టి అందర్నీ పిలిచారట.దాంతో కోట ని చుట్టుముట్టిన వాళ్ళందరూ బూతులు తిడుతూ చితక్కొట్టారట.

ఇక అక్కడికి వచ్చిన కొంతమంది పెద్దవాళ్ళు కోట శ్రీనివాసరావుని కాపాడి పంపించారట.ఇక కోట చేసిన పనికి ఇండస్ట్రీలో ఉన్న ఒక వర్గం వాళ్లు కూడా ఆయనకి అవకాశాలు ఇవ్వకపోవడంతో కెరీర్ నాశనం అవుతుందిని ఓ రోజు నేరుగా రామారావు దగ్గరికి వెళ్లి కలిసి కలిశారట. కానీ కోట చేసిన పనికి కోపంగా ఉన్న ఎన్టీఆర్ అదేదీ పట్టించుకోకుండా మీలో మంచి టాలెంట్ ఉంది అని విన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆరోగ్యం జాగ్రత్త అంటూ దీవించారట. ఆ తర్వాత ఎన్టీఆర్ రెండు కాళ్ల మీద పడి కోట క్షమించమని అడిగారట.ఇక ఈ ఒక్క సంఘటనతో కోట శ్రీనివాసరావుకి మళ్లీ ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయట. అలా ఎన్టీఆర్ ను ధిక్కరించినందుకు టాలీవుడ్ ఇండస్ట్రీ అప్పట్లో కోట ని వెలివేసినట్టు కొంతమంది మాట్లాడుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: