
ఆల్మోస్ట్ ఈ కాంబో సెట్ అయిపోయినట్లే అంటూ సినీ వర్గాలలో కూడా ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఆ కాంబో మరేంటో కాదు ..జూనియర్ ఎన్టీఆర్ - అనుష్క . హీరోయిన్ అనుష్క "సూపర్" అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఈ హీరోయిన్ మా అన్న తారక్ తో నటిస్తే బాగుంటుంది అంటూ చాలా మంది వెయిట్ చేశారు. స్టార్ హీరోయిన్ అనుష్క తో జూనియర్ ఎన్టీఆర్ కాంబో సెట్ చేయడానికి చాలా మంది డైరెక్టర్స్ ట్రై చేశారు . కానీ వర్క్ అవుట్ అవ్వలేదు.
వీళ్లిద్దరు జత కడితే సినిమా ఓ రేంజ్ లో ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే వీళ్ళ కాంబోలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాలేకపోయింది . కొన్ని సినిమాలు అనుకున్న కొన్ని కారణాల చేత అవి సెట్స్ పై కి రాలేకపోయాయి. ఇన్నాళ్ళకి వీళ్ళ సినిమా కాంబో సెట్ అయినట్లు తెలుస్తుంది. దేవర 2 సినిమాలో అనుష్క ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేయబోతుందట . రీసెంట్ గానే డైరెక్టర్ కొరటాల శివ దాని గురించి ఆమెకు వివరించారట . నిజానికి హీరోయిన్ రోల్ తప్పితే పక్క రోల్ చెయ్యదు అనుష్క . కానీ ఈ సినిమాలోని క్యారెక్టర్ బాగా నచ్చేయడంతో అందుకు ఓకే చేసిందట. అన్ని కుదిరితే దేవర 2 లో అనుష్కను జూనియర్ ఎన్టీఆర్ ని పక్క పక్కనే మనం చూడొచ్చు..!!