ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో తీవ్రంగా విఫలం అయిన ఆ తర్వాత ఓ టీ టీ లో అద్భుతమైన రీతిలో ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ తెచ్చుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. ఆ కోవాలోకే బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అక్షయ్ కుమార్ నటించిన ఓ సినిమా కూడా చేరినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి అక్షయ్ కుమార్ కొంత కాలం క్రితం బెల్ బాటమ్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ ని దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించారు. అలా భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాను 2021 వ సంవత్సరం ఆగస్టు 19 వ తేదీన పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు కేవలం 2.75 కోట్ల కలెక్షన్లు మాత్రమే దక్కాయి. ఇక లాంగ్ రన్ లో కూడా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దానితో బాక్సా ఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ ను అందుకుంది. 

బాక్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఆ తర్వాత కొంత కాలానికి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని అందుకున్న ఈ సినిమా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో మాత్రం సూపర్ సాలిడ్ రెస్పాన్స్ ను జనాల నుండి దక్కించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా అక్షయ్ కుమార్ నటించిన బెల్ బటమ్ సినిమా బాక్సా ఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన ఓ టీ టీ లో మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: