రష్మిక విజయ్ దేవరకొండ చాలా సంవత్సరాల నుండి డేటింగ్ లో ఉన్నారు. వీరిద్దరూ కలిసి గీతగోవిందం,డియర్ కామ్రేడ్ వంటి రెండు సినిమాలు చేశారు.త్వరలోనే విజయ్ దేవరకొండ రష్మిక కాంబోలో మరో సినిమా కూడా రాబోతుందని రష్మిక ఈ మధ్యకాలంలో హింట్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈ నేపథ్యంలోనే తాజాగా రష్మిక విజయ్ దేవరకొండ ఇద్దరు పెళ్లికి రెడీ అయ్యారని, ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నట్టు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.ఇక విషయంలోకి వెళ్తే.. ఛలో మూవీ తో రష్మిక మందన్నాకి,అర్జున్ రెడ్డి, పెళ్లిచూపులు  మూవీ తో  విజయ్ దేవరకొండకు కెరియర్ స్టార్ట్ అయింది అని చెప్పుకోవచ్చు.అయితే ఈ సినిమాల కంటే ముందు వీరిద్దరూ వేరే సినిమాలు చేసినప్పటికీ ఈ సినిమాల ద్వారానే గుర్తింపు లభించింది.

ఆ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్లో వచ్చిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత మళ్లీ వీరి కాంబోలో డియర్ కామ్రేడ్ వచ్చి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలు చేసినప్పటి నుండే వీరిమధ్య ప్రేమ వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ వీరిద్దరూ ఫ్రెండ్స్ అంటూ కప్పి పుచ్చుకున్నారు.కానీ సమయం దొరికినప్పుడల్లా ఇద్దరు వెకేషన్ లకి వెళ్లడం, పండగలకు రష్మిక విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్ళిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా వీరిద్దరూ వెకేషన్ లకి వెళ్ళిన ఫొటోస్ బ్యాగ్రౌండ్ ని బట్టి ఒకే దగ్గరికి ఈ జంట వెకేషన్ కి వెళ్ళినట్టు చాలామంది నెటిజన్స్  గుర్తుపట్టారు.

 అయితే తాజాగా విజయ్ దేవరకొండ రష్మిక మందన్నాలు ఆగస్టులో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్టు టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ కి సంబంధించి అన్ని పనులు పూర్తి చేశారని,ఆగస్టులో ఈ జంట ఎంగేజ్మెంట్ తో ఒక్కటి కాబోతున్నట్టు ఓ వార్త ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అంతేకాదు తాజాగా రష్మిక కూడా తన సోషల్ మీడియా ఖాతాలో గుడ్ న్యూస్ రాబోతోంది.ఒకప్రత్యేకమైన రోజు అన్నట్లుగా ఒక పోస్ట్ పెట్టింది.అయితే ఈ పోస్ట్ తన ఎంగేజ్మెంట్ ని ఉద్దేశించే పెట్టిందని చాలామంది మాట్లాడుకుంటున్నారు.ఇక విజయ్ దేవరకొండ సినిమా విషయానికొస్తే గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వచ్చిన కింగ్డమ్ మూవీ ఈనెల అనగా జూలై 31న విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: